News Breaking
Live
wb_sunny

Breaking News

వైస్సార్ కాపు నేస్తం పథకం 2021-22 - 𝐘𝐒𝐑 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 2021

వైస్సార్ కాపు నేస్తం పథకం 2021-22 - 𝐘𝐒𝐑 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 2021

వైయస్సార్ కాపు నేస్తం పథకం 2021-22

వైయస్సార్ కాపు నేస్తం పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి  అప్లికేషన్ ఫారం.



𝐓𝐢𝐦𝐞𝐥𝐢𝐧𝐞𝐬 𝐨𝐟 𝐘𝐒𝐑 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦

  వైయస్సార్ కాపు నేస్తం ఇంటింటి సర్వే జులై 1 నుంచి జూలై 7 వరకు

  ఫైనల్ జాబితా 8 నుంచి 13 వరకు డిస్ప్లే

  జూలై 24న ఈ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 

పథకం యొక్క ఉద్దేశం :-

కాపు సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించడం.


ప్రయోజనాలు :-

• అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం.

• మొత్తం ఐదేళ్ల పాలనలో 75 వేల రూపాయల ఆర్థిక సాయాన్నందించడం


అర్హతలు :-

• 45 ఏళ్ల నుంచి  60 ఏళ్లలోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

• కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి.

• కుటుంబానికి గరిష్టంగా మూడెకరాల మాగాణి లేదా పదెకరాల మెట్ట భూమి.. లేదా మాగాణి, మెట్ట రెండూ కలిపి పదెకరాలకు మించరాదు.

* పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్న వారు.

* ఆటో, టాటా ఏస్, ట్రాక్టర్ లాంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చు.

• కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ ఈ పథకానికి అర్హులే.


అనర్హతలు :-

• కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు.

• పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.

• కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.

• ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు.

• కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే ఈ పథకానికి అనర్హులు.


కావలసిన పత్రాలు :-

  1. • ఆధార్ కార్డు.
  2. • కుల ధ్రువీకరణ పత్రం.
  3. • ఆదాయ ధ్రువీకరణ పత్రం.
  4. • నివాస ధ్రువీకరణ పత్రం.
  5. • వయసు నిర్ధారణ పత్రం


ఇతర వివరములు :-

  • డబ్బులు ఖాతాలో పడగానే లబ్ధిదారుల ఫోనుకు సందేశం వస్తుంది.
  • ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేనివారు ఉంటే గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తరువాత అర్హులైన వారికి కూడా తప్పనిసరిగా ఆర్థిక సాయం అందిస్తారు.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.