wb_sunny

Breaking News

వై యస్ ఆర్ వాహన మిత్ర అర్హతలు

వై యస్ ఆర్ వాహన మిత్ర అర్హతలు


వై యస్ ఆర్ వాహన మిత్ర


 ఆటో, ట్యాక్షి మరియు మ్యాక్షీ క్యాబ్ డ్రైవరులకు సంవత్సరానికి రూ. 10000/- భీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు మొదలైన వాటికి ఖర్చుల నిమిత్తం వాహన మిత్రా పధకం ద్వారా ఆర్ధిక సహాయం.

వై యస్ ఆర్ వాహన మిత్ర అర్హతలు


  • దరఖాస్తుదారుడు స్వీయ యజమాన్యం లోని ఆటో, ట్యాక్షీ మరియు మ్యాక్షీ – క్యాబ్ డ్రైవరు ఐ ఉండవలెను
  • ఆటో రిక్షా / లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి దరఖాస్తు దారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి .
  • ఆటో రిక్షా / ట్యాక్షీ మరియు మ్యాక్షీ క్యాబ్ రిజిస్ట్రేసన్ సర్టిఫికేట్ మరియు ఎల్టీ క్యాబ్స్ విషయంలో పన్ను వంటి చెల్లుబాటు అయ్యే రికార్డులు కలిగి ఉండాలి.
  • ఈ పధకం, ప్యాసింజర్ ఆటో రిక్షా / ట్యాక్షీ మరియు మ్యాక్షీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. త్రీ వీలర్ / ఫోర్ వీలర్ లైట్ గూడ్స్ వాహనాల యజమానులు ఈ పధకం కింద అర్హులు కారు.
  • ప్రతి ధరఖాస్తు దారుడు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • యజమాని తప్పనిసరిగా బియ్యం కార్డు ( బి పి ఎల్ / వైట్ రేషన్ కార్డు / అన్నపూర్ణ కార్డు / అంత్యోదయ కార్డు ) కలిగి ఉండాలి .
  • కుటుంబం అంటే భర్త , భార్య మరియు మైనర్ పిల్లలు. కుటుంబంలో ఒక వాహనానికి ( ఆటో రిక్షా / ట్యాక్షీ మరియు మ్యాక్షీ క్యాబ్) మాత్రమే  ఈ పధకం క్రింద ప్రయోజనం పొందడానికి అర్హులు.
  • ఒకే బియ్యం / వైట్ రేషన్ కార్డు లో వేర్వేరు వ్యక్తులపై యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది. ఏది ఏమైనా ఒకే బియ్యం / వైట్ రేషన్ కార్డు లో భర్త , భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన కుటుంబం లో ఒక వ్యక్తి మాత్రమే ఆర్ధిక సహాయం కోసం అర్హులు.
  • లబ్ధి దారుడు తండ్రి / తల్లి/కుమార్తె / సోదరుడు మరియు డ్రైవింగ్ లైసెన్స్ మేజర్ కుమారుడు / కుమార్తె పేరిట ఉంటే , వాహనం యొక్క రిజిస్టర్ యజమాని ఐనా తండ్రి / తల్లి / కుమార్తె / సోదరుడు ప్రయోజనం పొందడానికి అర్హులు. వారి పేర్లు వేర్వేరు బియ్యం కార్డు / వైట్ రేషన్ కార్డు లో ఉన్నప్పటికి అర్హులు.
  • ఇతర రాష్టాలు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లను కలిగి ఉన్న లబ్ధి దారులు సంబంధిత ఆర్ టి వో కార్యాలయాలో చిరునామా మార్పు కోసం ధరఖాస్తు చేసుకోవాలి.
  • ధరఖాస్తు సమయంలో వాహనం యజమాని వద్ద ఉండాలి
  • కొత్త లబ్ధి దారుల ధరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్లు సేకరించి వారి అర్హతలను ధృవీకరిస్తారు.
  • బ్యాంక్ ఖాతా వాహనం యజమాని పేరుమీద ఉండాలి. లబ్ధి దారుడి బ్యాంక్ ఖాతా షెడ్యూల్ చేసిన వాణిజ్య బ్యాంకులలో ఏదైనా ఒకటి కావచ్చు. బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ నకలును సమర్పించాలి .
  • ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనారిటీల కమ్యునిటీ విషయంలో కుల దృవీకరణ పత్రం ఉన్నచో ధరఖాస్తు తో జతపరచవలెను .
  • వాహనం బార్య పేరిట ( డ్రైవింగ్ లైసెన్స్ కలిగి లేదు ) ఉండి భర్త  నడుపుతుంటే ( భర్త కు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచో ) అలాంటి ధరఖాస్తు దారులను కూడా అర్హులుగా పరిగణిస్తారు.

         జాబితాలో పేరులేని వారు ధరఖాస్తు చేసుకునే విదానము

  1. కొత్త లబ్ధి దారులు గ్రామ / వార్డు వాలంటీర్లనుండి ధరఖాస్తులను పొందవచ్చును లేదా www.navasakam.ap.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని ధరఖాస్తును గ్రామ వార్డు వాలంటీర్ల వద్ధ దాఖలు చేయవచ్చును. 
  2. అర్హులైన ధరఖాస్తు దారునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన  ) నెంబరు ఇవ్వబడుతుంది.
  3. ధరఖాస్తు చేసిన లబ్ధి దారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తి చేసి అర్హ్త కలిగిన వారికి సంవత్సరానికి ఒక్క సారి మంజూరు చేసే వైయస్ ఆర్ వాహన మిత్ర పధకం ద్వారా లబ్ధి చేకూర్చ బడుతుంది.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.