పేదలందరికి ఇల్లు
పేదలందరికి ఇల్లు
పధకం లో భాగంగా ఇల్లు/ ఇంటి స్థలం కోరే పేదలందరికి , ఇంటి స్థలం మరియు పక్కా ఇల్లు నిర్మాణం
అర్హతలు
- గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని లబ్ది దారులు ఎవరైనా విధిగా దారిద్య్ర రేఖకు దిగువ వర్గంకు చెంది ఉండవలెను.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా లబ్ది దారునికి సొంత గృహము/ ఇంటి స్థలము ఉండరాదు.
- గతంలో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏ విధమైన గృహపధకాలలో లబ్ది దారు ప్రయోజనం పొంది ఉండరాదు.
- మొత్తం కుటుంబానికి మాగాణి 3 ఎకరాలు లేదా మెట్ట 10 ఎకరాలు లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఏకరాలలోపు ఉండవలెను.
జాబితాలో పేరు లేని వారు ధరఖాస్తు చేసుకునే విధానము
- అర్హత కలిగిన ధరఖాస్తు దారులు వారి ఆధర్ కార్డు మరియు భూమి యాజమాన్య ఆడంగల్ కాపీ ని జత చేసి ధరఖ్స్తును నేరుగా గ్రామ/ వార్డు సచివాలయాలో గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారగని ధరఖాస్తు చేసుకోవచ్చు
- అర్హులైన ధరఖాస్తు దారునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన ) నెంబరు ఇవ్వబడుతుంది.
- ధరఖాస్తు చేసిన 90 రోజులలో అర్హులైన ధరఖాస్తు దారునికి ఇంటి స్థలం కేటాయించబడును