దిశ చట్టంలో ప్రత్యేకతలు
- మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చట్టం (దిశ)..
- నేరస్తులకు వేగంగా శిక్ష పడితేనే వ్యవస్థలో భయం.
- రాష్ట్రంలో 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
- అనుమతి రాగానే ప్రతి జిల్లాకు ఒక దిశ కోర్టు, 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.
- 10 సెకన్లలో స్పందించేలా దిశ కాల్ సెంటర్
- సాక్ష్యాధారాలున్న కేసుల్లో 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, శిక్ష ఖరారు చేసేలా దిశ చట్టం,
- మహిళలకు అన్ని విధాలా అండగా ఉండేలా ప్రభుత్వం చర్యలు,
- రాజమహేంద్రవరంలో రాష్ట్రంలోనే తొలి 'దిశ మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం..
- దిశ యాప్ను ఆవిష్కరించి, ఆ యాప్ పని తీరును పరీక్షించిన సీఎం వై.ఎస్ జగన్
దిశ యాప్ గురించి చెప్పిన సి.ఎం జగన్...
- దిశ యాప్ ప్లే స్టోర్ లో అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- దీనిని దాదాపు 5,048 మొబైల్ టీమ్స్ కు లింక్ చేశాం.
- ఈ యాప్ ఓపెన్ చేసి ఎఓఎస్ అనే బటన్ నొక్కితే కేవలం 10 సెకన్లలో ఆడియో, వీడియో ట్రాన్స్ మీట్ అవుతుంది .
- నేరం చేస్తే ప్రతి అడుగులోనూ శిక్ష తప్పదని గట్టిగా సందేశాన్ని పంపించడం కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం.
- నేరాన్ని ఆపడం, నేరం జరిగితే వెంటనే శిక్షించడం ద్వారా నేరగాళ్లు, నేర మనస్తత్వం ఉన్న వారికి గట్టిగా సంకేతం పంపాలనేదే నా ఉద్దేశం.
దిశ చట్టంలో ప్రత్యేకతలు...
- మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు.
- ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి.
- దశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.
- దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు,
- ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు.
- 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం.
- రేప్, గ్యాంగ్ రేప్లకు పాల్పడితే ఉరిశిక్ష.
- చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు.
- సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష.
- అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు
- కుదింపు.
- మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్లైన్) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
- మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ఆధునికీకరణ
- తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్ఏ సెంటర్లు ,బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్లు.
- దిశ పోలీస్ స్టేషన్లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు, కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష.
- రాష్ట్రలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్ గ్రేడేషన్. ఒక డీఎస్పీ, మూడు ఎస్ఇ పోస్టులు మంజూరు.
- బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ.
- అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్.ఐ.ఆర్ సౌకర్యం.