wb_sunny

Breaking News

బియ్యం కార్డు - Rice Card

బియ్యం కార్డు - Rice Card


 బియ్యం కార్డు

“ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత -
ఇంటి వద్దకే నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకుల అందజేత " 

అర్హతలు:

  •  కుటుంబ నెలసరి ఆదాయము:
          గ్రామీణ ప్రాంతాలలో రూ. 10,000/- లోపు
          పట్టణ ప్రాంతాలలో రూ. 12,000/- లోపు ఉన్నవారు అర్హులు.

  •  సంబంధిత కుటుంబమునకు మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్టభూమి 100 ఎకరాలు లేదా రెండూ కలిప్ 10 ఎకరాలు మించకుండా ఉండవలెను.

  • కుటుంబం ప్రస్తుతం నివసిస్తున్న గృహం ( స్వంతం/అద్దె) యొక్క నెలవారీ విద్యుత్తు వినియోగము బిల్లు

  • 300 యూనిట్లు మించరాదు. (గత ఆరు నెలల విద్యుత్తు వినియోగము ಬಿಲ್ಲು సగటు 300 యూనిట్లు లేదా అంతకంటే తక్కువ ఉండవలెను).

  •  పట్టణ ప్రాంతాలలో 10000 చదరపు అడుగులు స్థలము అంతకన్నా తక్కువ విస్తీర్ణములో ఇల్లు ఉన్నవారే అర్హులు.

  •  కుటుంబ సభ్యులలో ఎవరికి 4 చక్రాల వాహనం కలిగిఉండరాదు (టాక్సీ, ట్రాక్చర్, ఆటోలకు మినహాయింపు).

  •  కుటుంబ సభ్యులలో ఆదాయపన్ను చెల్లింపుదారులు మరియు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పింఛనుదారులు ఉన్నచో బియ్యం కార్డు పొందుటకు అనర్హులు

(అన్ని శాఖలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మినహాయింపు).

అర్హులై వుండి ఇంకనూ బియ్యం కార్డు పొందనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:

1 . అర్హత కల్గిన కుటుంబము తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డుల నకలు, కుటుంబ ఆదాయ వివరాలను జతచేసిన నిర్ణీత దరఖాస్తును నేరుగా గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.

2 . అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your ServiceRequest " మీ సేవల అభ్యర్ధన) నెంబర్ ఇప్పుబడుతుంది.

3 . దరఖాస్తు చేసిన 10 పని దినములలో అర్హులైన దరఖాస్తుదారునికి బియ్యం కార్డు కేటాయించబడుతుంది .

⛔ సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1902

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.