wb_sunny

Breaking News

వై యస్ ఆర్ మత్స్య కార భరోసా అర్హతలు - YSR Matsyakarabarosa Eligibility Rules

వై యస్ ఆర్ మత్స్య కార భరోసా అర్హతలు - YSR Matsyakarabarosa Eligibility Rules


YSR Matsyakarabarosa Apply Online|| YSR Matsyakarabarosa Eligibility Rules || YSR Matsyakarabarosa Eligibility Status. 


సముద్రంపై  మరపడవలు మరియు తెప్పలపై చేపలు పట్టే మత్స్య కారుల జీవన ప్రమాణాలను పెంచుటకు వైయస్ ఆర్ మత్స్య కార భరోసా ద్వారా సంవత్సరానికి రూ. 10000/- ఆర్హిక సహాయం.


వై యస్ ఆర్ మత్స్య కార భరోసా  అర్హతలు 


  • మొత్తం కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో  నెలకు రూ. 10000/- మరియు పట్టణ ప్రాంతాలలో ఐతే రూ. 12000/- కంటే తక్కువ ఉండాలి.
  • మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
  • కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
  • కుటుంబం నివశిస్తున్న గృహం ( సొంతం/ అద్దే ) యొక్క నెలవారి విద్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లోపు ఉండవలెను. ( గత 6 నెలల విద్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను. )
  • పట్టణ ప్రాంతాలలో సొంత గృహ నిర్మానపు స్థలము 1000 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి
  • కుటుంబాలో ఏ ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు .
  • ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • బియ్యం కార్డు / రేషన్ కార్డు కలిగి ఉండాలి 9 ఒక కుటుంబం ఒక లబ్ధి ప్రతిపదిక )
  • 21 నుండి 60 సంవత్సరాలలోపు వయస్సు కలిగి , మత్స్య శాఖ నందు రిజిస్టర్ అయిఉన్న మరపడవలు మరియు తెప్పల పై సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు అర్హులు.
  • మత్స్య శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి మర మరియు యాంత్రిక పడవలు డీజిల్ సబ్సిడీ పధకం కు అర్హత కలిగి ఉంటాయి .


జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకునే విధానము


  1. అర్హత కలిగిన వారు బియ్యం కార్డు / రేషన్ కార్డు , ఆధర్ కార్డు , వారు వేట చేస్తున్నటువంటి పడవ / తెప్ప వివరాలతోపాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా గాని ధరఖాస్తు చేసుకోవచ్చు
  2. అర్హులైన ధరఖాస్తు దారునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన ) నెంబరు ఇవ్వబడుతుంది
  3. ధరఖాస్తు చేసిన లబ్ధి దారులకు నిర్ధేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ. 10000/- ఒకసారి మంజూరు చేసే వై యస్ ఆర్ మత్స్య కార భరోసా పధకం ద్వారా లబ్ధి చేకూర్చ బడుతుంది.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.