వాలంటీర్ల సేవలు కొనసాగింపు - Gvwvnews
వాలంటీర్ల సేవలు కొనసాగింపు
స్పష్టం చేసిన మంత్రి బాలవీరాంజనేయస్వామి
అమరావతి :
🔺 వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
🔺 కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల సేవల కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది.
🔺 దీంతో వాలంటీర్లు తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే ఆందోళనతో ఉన్నారు.
🔺 ఈ నేపథ్యం లో తమను కొనసాగించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి వాలంటీర్లు తీసుకు వచ్చారు.
🔺 అసెంబ్లీ సమావేశాల్లో సచివా లయ శాఖ మంత్రి డోల బాలవీరాంజ నేయస్వామి ఈ అంశంపై స్పందించారు.
🔺 వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని స్పష్టత ఇచ్చారు.
🔺 మరో రెండు మూడు రోజుల్లో వీరి సేవల కొనసాగింపుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు మంత్రి వివరించారు.
🔺 ప్రభుత్వ నిర్ణయంపై వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Source :- Andraparabha News