YSR Pension Kanuka Scheme Details -వైఎస్సార్ పెన్షన్ కానుక


అర్హతలు

  •  మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు 10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే 12 వేల కంటే తక్కువ ఉండాలి.
  •  మొత్తం కుటుంబానికి మూడు ఎకరాల మాగాణి భూమి లేదా  పదిఎకరాల మెట్ట లేదా మా గాని మరియు మెట్ట భూములు రెండు కలిపి పది ఎకరాల మించరాదు.
  • కుటుంబం మొత్తానికి నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. (ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ మినహాయింపులు)
  •  కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారుడు వుండరాదు.
  • కుటుంబం నివసిస్తున్న గృహం యొక్క నెలవారి విద్యుత్ వినియోగం బిలో 300 యూనిట్ల లోపు ఉండవలెను.
  •  పట్టణ ప్రాంతంలో నిర్మాణ స్థలం 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.
  •  కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయ పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.
  •  సాధారణంగా ఒక కుటుంబానికి ఒక పెన్షన్ (40 % మరియు ఆ పైన అంగవైకల్యం కలవారు మరియు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు మినహాయింపు) మాత్రమే.

వృద్ధాప్య పెన్షన్ :

  •         60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు.
  •         గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు

వితంతు పెన్షన్ :

  •         వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు.
  •         భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి

వికలాంగుల పెన్షన్ :

  •        40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
  •        సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు

చేనేత కార్మికుల పెన్షన్ :

  •       వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు.
  •       చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు

కల్లు గీత కార్మికుల పింఛన్ :

  •       వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
  •      ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

మత్స్యకారుల పెన్షన్ :

  •     వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
  •     మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్ :

  •    వయో పరిమితి లేదు.
  •    ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు.

డయాలసిస్ (CKDU) పెన్షన్

  •     వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5)
  •    వయో పరిమితి లేదు.

ట్రాన్స్ జెండర్ పెన్షన్ :

  •    18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు.
  •    ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు.

ఒంటరి మహిళ పెన్షన్ :
  •        వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.)
  •       గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.

  •    అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. 
  • పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)


డప్పు కళాకారుల పెన్షన్ :

  •       వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
  •       సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి.

చర్మకారుల పెన్షన్ :

  •     వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
  •     లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది.

అభయ హస్తం పెన్షన్ :

  •        స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.

YSR Pension Status | Check YSR Pension Kanuka Application Status Online


Step 1-  Visit the Official Website YSR Pension Kanuka


Step 2-  Now, Click on the “Search” Option

Step 3-  Next, you need to provide “Pension ID” or “Grievance ID”

Step 4-  Provide the information and click on “Go” to check the status of your Application
error: Content is protected !!