భీమా కార్డ్స్ పంపిణీ విధానం
భీమా కార్డ్స్ పంపిణీ విధానం:
1. వాలంటీర్స్ తమవద్ద ఉన్న APP లో (బీమా eKYC App) లబ్ధిదారుడి యొక్క ప్రీమియం అమౌంట్ బ్యాంకు నుండి ఇన్సూరెన్సు కంపెనీకి వెళ్ళిందా లేదా చెక్ చేసుకోవాలి...
2. ప్రీమియం అమౌంట్ ఇన్సూరెన్సు కంపెనీకి వెళ్ళిన లబ్ధిదారుడి నుండి బయోమెట్రిక్ తీసుకొన్న తర్వాతే భీమా కార్డు ఇవ్వాలి...
3. లబ్ధిదారుడి యొక్క ప్రీమియం అమౌంట్ బ్యాంకు నుండి ఇన్సూరెన్సు కంపెనీకి వెళ్ళకపోతే వారి యొక్క కార్డు వెల్ఫేర్/వార్డ్ అసిస్టెంట్స్ వద్ద ఉంచి అమౌంట్ వెళ్ళిన తర్వాత వారికి కార్డు ఇవ్వాలి...
4. గ్రామ/వార్డ్ వాలంటీర్ లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి లేఖను బీమా కార్డ్ హోల్డర్‌కు చదివి వినిపించాకే అర్హులకే కార్డు అప్పగించి రసీదు తీసుకోవాలి. రసీదులు అన్నీ వెల్ఫేర్ అసిస్టెంట్ కి ఇవ్వాలి. వారు వాటిని సంబంధిత గ్రామ/వార్డ్ సెక్రటేరియట్స్ లో భద్రపరచాలి...
5. లబ్ధిదారుడు శాశ్వతంగా వలస పోయిన/అందుబాటులో లేకపోయిన/మరణం/ గుర్తించబడకపోతే, అలాంటి కార్డులు గ్రామ/వార్డ్ సెక్రటేరియట్స్ వద్ద వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి వార్డ్ వాలంటీర్లు తిరిగి ఇవ్వాలి...
6. వాలంటీర్స్ పాలసీ దారుని బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత బీమా కార్డులను చేతికి ఇవ్వాలి. వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తారు. ప్రతిరోజూ ఈ నివేదికను MPDO/మునిసిపల్ కమీషనర్ కు ఇవ్వాలి. అక్కడ నుండి Consolidation రిపోర్ట్ PD-DRDA, JC Welfare కు పంపాలి/సమర్పించాలి...
గమనిక :-
1. కార్డు డిస్ట్రిబ్యూషన్ యాప్ : YSR BIMA eKYC.apk ఈ యాప్ ప్రతి వాలంటీర్ డౌన్లోడ్ చేసుకోవాలి...
2. భీమా కార్డుల పంపిణీ మొత్తం MPDO/మునిసిపల్ కమీషనర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది...
3. కార్డులు/ముఖ్యమంత్రి గారి లేఖలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. గ్రామ/వార్డ్ సచివాలయంలో భద్రపరచాలి...