రేషన్ పంపిణీ విషయములో వాలంటీర్స్ అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

రేషన్ పంపిణీ యొక్క FAQ 


1. వాహనంలో ఉన్న నిత్యావసర సరుకులను పంపిణీ సమయంలో తూకం వేయడం వాలంటీరే చేయాలా?

జ. అవసరం లేదు. వాహన ఆపరేటర్ ఈ పనులను చేయడం కోసం ఒక సహాయకున్ని నియమించుకుంటాడు.

2. నిత్యావసర సరుకుల పంపిణీ రోజున వాలంటీర్ అందుబాటులో లేకపోతే ఆ నెల రేషన్ ప్రక్రియ ఆగిపోతుందా?

జ . ఆగిపోదు. అందుబాటులో లేని వాలంటీర్ స్థానంలో మరొక వాలంటీర్'ని వాహన ఆపరేటర్అభ్యర్థన మేరకు వి.ఆర్.ఓ గారు నియమిస్తారు.

3. మొబైల్ వాహనంలోని మైకు ద్వారా నిత్యావసర సరుకులను తీసుకెళ్లమని ప్రజలకు అనౌన్స్ మెంట్స్ ఎవరు చేయాలి?

జ. వాహన ఆపరేటర్ ఈ పనులను చేయడం కోసం ఒక సహాయకున్ని నియమించుకుంటాడు.

4. లబ్ధిదారులందరికీ నిత్యావసర సరుకుల పంపిణీ చేసే బాధ్యతను ప్రాధమికంగా ఎవరు తీసుకుంటారు?

జ . తమకు మ్యాప్ చేసిన బియ్యం కార్డు దారులందరికీ నిత్యావసర సరుకుల పంపిణీ జరిగే బాధ్యత సంబంధిత వాలంటీరుదే.

5. ఏరోజుకారోజు జరిపిన నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించిన వివరాల రిజిస్టర్'ను ఎవరు నమోదు చేస్తారు?

జ. మొబైల్ వాహన ఆపరేటర్ మరియు వాలంటీర్ ఇద్దరూ పంపిణీ రిజిస్టర్ ను నిర్వహించవలెను. ఆ రిజిస్టర్ ని అధికారుల తనిఖీ నిమిత్తం అందుబాటులో ఉంచవలెను.

6. బియ్యంకార్డు దారుల వేలిముద్రల అతెంటికేషన్, ఈ-పాస్ లోని ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్, EKYC అనే ఈ మూడు విధాల అతెంటికేషన్స్ ఫెయిల్ అయినట్లైతే నిత్యావసర సరుకుల
పంపిణీని ఎలా చేస్తారు?

జ. అలాంటి కార్డుదారులకు నామినీగా సంబంధిత వాలంటీర్లను నమోదు చేసి వారి ద్వారా పంపిణీ చేస్తారు.

7. ఈ-పాస్ నందు వేలిముద్రల అతెంటికేషన్ ఫెయిల్ విషయంలో ఎవరికి వాలంటీర్లను నామినీగా నియమిస్తారు?

జ. ఆ కుటుంబ సభ్యులలో 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు లేదా 60 సంవత్సరాలకు పైబడిన వారు ఉన్నట్లైతే వారికీ, కుష్టు వ్యాధిగ్రస్తులు మరియు దీర్ఘకాలిక రోగులకు, రోజువారీ క్వారీలలో కూలి పనులు మొదలైన వృత్తులను చేసుకునేవారికి వాలంటీర్లను నామినీగా నియమిస్తారు.

8. కార్డుదారుని వేలిముద్రలు సరిగా నమోదు కానప్పుడు ekyc ని ఎక్కడ చేయించుకోవాలి?

జ. ఆధార్ నమోదు కేంద్రం

9. ఏ క్లస్టర్ లోనూ మ్యాప్ కాబడని కార్డుదారులు నిత్యావసర సరుకులను ఎలా పొందుతారు?

జ. సమీప చౌక దుకాణం ద్వారా లేదా వారి ఇంటి వద్దకు వచ్చిన వాహనాల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ వేయడం ద్వారా పొందుతారు. ఆ తర్వాత నెల నుంచి ఆ వాహనాలకు మ్యాప్ చేయబడుతుంది.

10. మొబైల్ వాహన ఆపరేటర్ సెలవు పట్టి రానప్పుడు ఆపరేటింగ్ పని కూడా వాలంటీరే చేయలా?

జ. ఆ విషయాన్ని ముందు రోజున సంబంధిత సచివాలయంలో VRO/తహసీల్దార్'కు తెలియజేసి తప్పనిసరిగా వేరొక డ్రైవర్'ని ఏర్పాటుచేసి పంపిణీకి ఆటంకం కలుగకుండా చూడవలెను.

11. సరుకులను తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం అందచేసిన సంచులను వాలంటీర్ తిరిగి తీసుకోవాలా ?

జ. తీసుకోకూడదు. ప్రతి నెలా సరుకుల పంపిణీ సమయంలో ఉచితంగా అందజేసిన సంచులను ఉపయోగించే విధంగా అవగాహన కల్పించాలి.

వీలైతే మీ మిత్రులైన వాలంటీర్స్ అందరికీ ఈ మెసేజ్ షేర్ చేయగలరు ధన్యవాదాలు 

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!