Ads Area

Disha act - దిశ చట్టంలో ప్రత్యేకతలు

 దిశ చట్టంలో ప్రత్యేకతలు

🔸 మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చట్టం (దిశ)..

🔹నేరస్తులకు వేగంగా శిక్ష పడితేనే వ్యవస్థలో భయం.

🔸 రాష్ట్రంలో 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

🔹 అనుమతి రాగానే ప్రతి జిల్లాకు ఒక దిశ కోర్టు, 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.

🔸 10 సెకన్లలో స్పందించేలా దిశ కాల్ సెంటర్

🔹 సాక్ష్యాధారాలున్న కేసుల్లో 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, శిక్ష ఖరారు చేసేలా దిశ చట్టం,

🔸 మహిళలకు అన్ని విధాలా అండగా ఉండేలా ప్రభుత్వం చర్యలు,

🔹 రాజమహేంద్రవరంలో రాష్ట్రంలోనే తొలి 'దిశ మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం..

🔸 దిశ యాప్ను ఆవిష్కరించి, ఆ యాప్ పని తీరును పరీక్షించిన సీఎం వై.ఎస్ జగన్


దిశ యాప్ గురించి చెప్పిన సి.ఎం జగన్...

🔸 దిశ యాప్ ప్లే స్టోర్ లో అందరికీ అందుబాటులో ఉంది.
ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🔹 దీనిని దాదాపు 5,048 మొబైల్ టీమ్స్ కు లింక్ చేశాం.

🔸 ఈ యాప్ ఓపెన్ చేసి ఎఓఎస్ అనే బటన్ నొక్కితే కేవలం 10 సెకన్లలో ఆడియో, వీడియో ట్రాన్స్ మీట్ అవుతుంది .

దిశ చట్టంలో ప్రత్యేకతలు... 


🔸 మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు.

🔹 ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి.

🔸 దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.

🔹 దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు,

🔸 ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు.

🔹 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం.

🔸 రేప్, గ్యాంగ్ రేప్లకు పాల్పడితే ఉరిశిక్ష.

🔹 చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు.

🔸 సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష.

🔹 అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు
కుదింపు.

🔸 మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్లైన్) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

🔹 మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఆధునికీకరణ

🔸 తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్ఏ సెంటర్లు ,బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్లు.

🔹 దిశ పోలీస్ స్టేషన్లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు, కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష.

🔸 రాష్ట్రలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్ గ్రేడేషన్. ఒక డీఎస్పీ, మూడు ఎస్ఇ పోస్టులు మంజూరు.

🔹 బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ.

🔸 అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్.ఐ.ఆర్ సౌకర్యం.

🔹 నేరం చేస్తే ప్రతి అడుగులోనూ శిక్ష తప్పదని గట్టిగా సందేశాన్ని పంపించడం కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం.

🔸 నేరాన్ని ఆపడం, నేరం జరిగితే వెంటనే శిక్షించడం ద్వారా నేరగాళ్లు, నేర మనస్తత్వం ఉన్న వారికి గట్టిగా సంకేతం పంపాలనేదే నా ఉద్దేశం.

Below Post Ad

Ads Area

Don't Try to copy, just share