Andhra Pradesh Voter List & Election 2024 Dates Telugu - GVWV News

 


Andhra Pradesh Voter List &  Election 2024 Dates :-


AP Elections 2024:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు వెలువరించింది. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి.


ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముఖ్య తేదీలు
నోటిఫికేషన్ జారీ 18-04-2024
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 25-04-2024
నామినేషన్ల పరిశీలన 26-04-2024
ఉపసంహరణకు చివరి తేదీ 29-04-2024
పోలింగ్ తేదీ 13-05-2024
ఓట్ల లెక్కింపు 04-06-2024


క్షణాల్లో ఓటరు కార్డుని డౌన్లోడ్ చేసుకోండిలా..!


➠ ఓటరు ఐడీ కార్డును పొందడానికి ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్  http://voters.eci.gov.in  లోకి వెళ్లాలి 



➠ అక్కడ మీ మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ కావాలి


➠ ఇప్పుడు మీకు సైట్ లో కుడివైపు కింద మూలకు E-EPIC Download కనిపిస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి.


➠ ఇందులో రిజిస్టర్ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడీ లేదా Epic నెంబర్ వంటి సమాచారం ఇచ్చి క్యాప్యాతో కూడి రిక్వెస్ట్ ఓటిపీని నొక్కాలి.


➠ మీ రిజిస్టర్ మొబైల్ ద్వారా అందుకున్న ఓటీపీ ఎంటర్ చేయాలి


➠  ఇప్పుడు డిజిల్ ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడానికి మీరు eEPIC పై క్లిక్ చేయాల్సి ఉంటుంది


➠  ఇలా చేయడం ద్వారా PDF ఫార్మాట్లో మీ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.



ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులభం. 


➠ ముందుగా https://electoralsearch.eci.gov.in ఓపెన్ చేయాలి. 



➠ ఇప్పుడు మీ పేరు సెర్చ్ చేసేందుకు మీడు మూడు ఆప్షన్లు కన్పిస్తాయి. 


➠ EPIC ID లేదా మొబైల్ నెంబర్ లేదా ఇతర వివరాలను సమర్పించడం ద్వారా సెర్చ్ చేయవచ్చు. 


➠ మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. 


➠ ఇతర వివరాలంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, జెండర్, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు ఫిల్ చేయాలి. 


➠ తరువాత క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చాలు..


➠ జాబితాలో మీ పేరుంటే అక్కడ పోలింగ్ బూత్, అడ్రస్, సీరియల్ నెంబర్ తో సహా వివరాలు కన్పిస్తాయి.



➠ EPIC IDతో చెక్ చేయాలంటే సంబంధిత ఆప్షన్ ఎంచుకుని నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే చాలు ఓటరు జాబితాలో మీ పేరుంటే ఆ వివరాలు పోలింగ్ స్టేషన్, సీరియల్ నెంబర్ అన్నీ కన్పిస్తాయి. 


➠ ఇక మొబైల్ నెంబర్‌తో సెర్చ్ చేసేందుకు ఓటీపీ ధృవీకరించుకోవాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే చాలు అన్ని వివరాలు కన్పిస్తాయి. ఈ మూడు మార్గాల్లో ఎలాగైనా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఏప్రిల్ 15 వరకూ ఏపీలో ఓటర్ల నమోదుకు అవకాశముంటుంది. 


How to Download the Complete Electoral Roll in PDF Format ?


Step 1 : Visit the website at https://ceoaperolls.ap.gov.in/AP_Eroll/Rolls



Step 2: Choose your district


Step 3: Select your Assembly Constituency


Step 4: Select 'Get Polling Stations'


Step 5: You will see the list of polling stations in the Assembly Constituency


Step 6: Click on 'View 'once you find your polling station. Now, you can see the Complete Electoral Roll in the PDF format


Step 7: Click on 'Download'





error: Content is protected !!