AP Pensions: పింఛన్ తీసుకునేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మే నెల పింఛన్లపై కీలక ప్రకటన - GVWV News

 


AP Govt May month pensions Distribution : 


నెలాఖరు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో కొత్త నెల ప్రారంభం కానుంది. మరి పింఛన్ల పంపిణీపై ఎలా అని ఆలోచిస్తున్న అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛన్ల కోసం సచివాలయాలకు వచ్చే పనిలేకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్ మొత్తాన్ని జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అకౌంట్లు లేనివారికి ఇంటివద్దనే పంపిణీ చేస్తామని తెలిపింది.



ఏపీలో పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. మే ఒకటో తేదీ వస్తోంది.. పింఛన్ ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరిస్తారనే విషయాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెల మాదిరిగా మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు ఇళ్లవద్దనే పింఛన్ సొమ్ము అందించనున్నారు.


 పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. బ్యాంకు అకౌంట్లు లేనివారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. మే ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకూ సచివాలయ ఉద్యోగులు వీరికి ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.



మే, జూన్ నెలలకు సంబందించి పింఛన్ పంపిణీకి సంబంధించి ముఖ్య సూచనలు 


☞ ఆధార్ తో  బ్యాంకు ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే..


☞  అనారోగ్యంతో పింఛను పొందుతున్న వారు, మంచం/వీల్ చైర్ కే పరిమితమైన వారికి ఇంటివద్దే పంపిణీ


☞ దివ్యాంగులు, అమరజవానుల భార్యలకూ ఇంటి వద్దే పింఛను


☞  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు


☞  రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు.. దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలో జమ


  కొందరు పెన్షన్ దారులకు BANK  Accounts కు మరి కొందరికి Door to Door ద్వారా ఇంటికి ఇవ్వటం జరుగును. 


  దాదాపు 75 శాతం మందికి వారి వారి అకౌంట్లకి పెన్షన్ బదిలీ  చేయబడును.


☞  మిగిలిన 25 శాతం  పెన్షనర్  లకు  డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేయబడును.


☞  ఎవరికి బ్యాంక్ అకౌంట్ కి జమ చేయబడుతుంది, మరియు ఎవరికి డోర్ టు డోర్ పంపిణీ చేయబడుతుంది అనే వివరాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. 


  ఈ సమాచారాన్ని ముందే సంబంధిత పెన్షన్ దారులకు తెలియజేయవలసి ఉంటుంది.


  బ్యాంకు ఖాతాలకు జమ చేయబడిన మొత్తాలలో రిజెక్ట్ అయిన వాటికి మళ్లీ డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరుగుతుంది.


ఏ ఒక్క పెన్షనర్ కూడా సచివాలయానికి పెన్షన్ కొరకు రావలసిన అవసరం లేదు.


error: Content is protected !!