AP: పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే ? - GVWV News

 


AP: పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే ?

 

పేదల పింఛన్‌ మొత్తాన్ని రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచారు. చంద్రబాబు తన మూడో సంతకాన్ని ఈ ఫైలుపైనే చేశారు.


New Updates

వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం పేరును ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. 2014-19 మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది.



ఇకపై వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జులై 1న రూ.7,000 ఇస్తుంది. దివ్యాంగులకు రూ.6వేలు అందనుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా.


వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్య కారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)

 

దివ్యాంగులకు ₹5,000(గతంలో ₹3వేలు)

 

కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000

 

కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)

మంచానికి పరిమితమైనవారికి ₹15,000(గతంలో ₹5వేలు) 

 

 

మేం అధికారంలోకి వస్తే ఏప్రిల్‌ నుంచే పెరిగిన పింఛను అమలుచేస్తామని... ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో రూ.7వేలు ఇస్తామని చెప్పాం. దీనిప్రకారం... జూలైలో ఈ 3నెలల బకాయి 3వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7వేలు అందుతాయి. అలాగే దివ్యాంగుల పింఛను రూ.4వేల నుంచి 6 వేలకు పెంచుతున్నాం. వారికి బకాయిలతో కలిపి జూలైలో రూ.12 వేలు అందుతుంది’’ అని చంద్రబాబు వివరించారు.   

 


error: Content is protected !!