కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉన్న ముఖ్య పథకాల వివరాలు - GVWV News



TDP Janasena BJP Manifesto 2024: 

 ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతోపాటూ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ జనసేన బీజేపీ కూటమి తమ మేనిఫెస్టో తాజాగా ఎపీ ఎన్నికలు ఫలితాలు రావడంతో   ఇప్పుడు వైరల్‌గా మారింది . టీడీపీ అధినేత చంద్రబాబు  సూపర్ సిక్స్ గ్యారెంటీ హామీలను ఈ మేనిఫెస్టోలో చేర్చారు. అలాగే.. జనసేన పార్టీ సూచించిన షన్ముఖ వ్యూహం పథకాలు, హామీలను కూడా చేర్చారు. ఇలా అన్నీ చేర్చడం వల్ల ఈ మేనిఫెస్టో భారీగా రూపొందింది.


ఉమ్మడి ప్రభుత్వం చెప్పిన ముఖ్య హామీలు..


మెగా డీఎస్సీపై తొలి సంతకం అని నిరుద్యోగులకు మేలు జరిగేలా వాగ్ధానం చేశారు. అలాగే వృద్దాప్య పెన్షన్ నెలకు రూ. 3నుంచి 4వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు. అది కూడా ఈ ఏప్రిల్ నుంచే అమలవుతుందని చెప్పారు చంద్రబాబు. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఇప్పటికే వృద్దాప్య పెన్షన్ రూ. 3 వేలు ప్రకారం అవ్వాతాతలు తీసుకున్నారు. మిగిలిన రూ.1000 బకాయిలను మూడు నెలలకు రూ. 3వేలు కలిపి జూలై నెల కొత్త పెన్షన్‎తో మొత్తం రూ. 7వేలు అందిస్తామన్నారు. ఇంతేకాకుండా దివ్యాంగుల పెన్షన్ ను రూ. 6వేలకు పెంచారు చంద్రబాబు. దీంతో లబ్ధిదారులకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. వీటితో పాటు మరికొన్ని వర్గాలకు మేలు చేసేలా సరికొత్త హామీలు ఎన్నికల ప్రచారంలో తెరపైకి తీసుకొచ్చారు.

 



టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవే :


1. మెగా డీఎస్సీపై తొలి సంతకం


2. వృద్ధాప్య పెన్షన్ నెలకు రూ.4000 (ఏప్రిల్ నుంచి ఫించన్ వర్తింపు)


3. దివ్యాంగుల పెన్షన్ నెలకు రూ.6000


4. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500


5. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం


6. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు (సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు)


7. నిరుద్యోగ భృతి నెలకు రూ.3000


8. తల్లికి వందనం పథకం కింద ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇది వర్తింపు.


9. సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.


10. ప్రతి రైతుకూ సంవత్సరానికి రూ.20000 పెట్టుబడి సాయం.


11. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000


12. భూ హక్కు చట్టం రద్దు


13. పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం


14. పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం


15. విదేశీ విద్యా పథకం


16. పండుగ కానుకలు


17. చెత్త పన్ను ఎత్తివేత

 


error: Content is protected !!