వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంపు - GV WV News

 




 

వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంపు.


రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా సుమారు 2.50లక్షల మంది వాలంటీర్లను నియమించింది.


ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్న వివిధ సంఘటనల నేపథ్యంలో వేలాది మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. వారిలో 90శాతం మందికిపైగా వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగస్వాములయ్యారు. అయితే లక్షా 50వేల మందికి పైగా వాలంటీర్లు ప్రభుత్వంలోనే ఉండిపోయారు. వారందరికీ గతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల జీతాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తొంది.

 


అదే విధంగా వారి సేవలను కూడా మరింత విస్తరింప చేయబోతున్నారు. గతంలో 50 ఇళ్లకు పరిమితమైన వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ప్రాంతాల్లో వారి సేవలను ఉపయోగించుకోవడంతో పాటు సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారిని భాగస్వాములు చేసే దిశగా కొత్త ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంమీద ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక పల్లె పాలనపై పూర్తి ప్రక్షాళన చేపట్టే దిశగా అడుగులు వేయబొతున్నారు. అందుకు సంబం ధించి ప్రణాళికలు కూ డా సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.


Source : ఆంధ్రప్రభ - 11.06.24
error: Content is protected !!