AP Volunteer: వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే వారికి ఉద్యోగాలు..! - gvwv news
AP Volunteer: వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే వారికి ఉద్యోగాలు..!
Chandrababu Govt Decision On Volunteers :
కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ మార్గదర్శకాలను ప్రభుత్వం విడదల చేయన్నున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని వారు జీతాలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.
అయితే గత ప్రభుత్వం ఒత్తిడి కారణంగా చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేయగా, మరికొందరి చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతీ పథకంలోనూ కీలక వ్యవహరించిన వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. జూలై నెల పింఛన్ పంపిణీలో కూడా వీరితో కాకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించారు.
అయితే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థపై కొన్ని మార్పులు, చేర్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో కచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కొందరు మంత్రులు కూడా వెల్లడించారు.
వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలనే ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు.
అంటే మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వంలో ఉందట.
వాలంటీర్లకుగా ఉద్యోగాలు చేసేవారికి ఈ మూడేళ్లలలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట.
వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవాలని.. ఆ తర్వాత మార్పులు, చేర్పులపై అధికారులతోత చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందంటున్నారు