Advertisement

ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ వాలంటీర్లు E - KYC సర్వే చేయు విధానం - GV WV News

Arun Kumar G
Monday, December 18, 2023
Last Updated




ఆరోగ్య  శ్రీ  కార్డులు పంపిణీ - Volunteers E - KYC Survey :-

వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి పెరిగిన ఆరోగ్యశ్రీ మొత్తం అమౌంటు కోసం వివరిస్తూ ఆరోగ్యశ్రీ సర్వీసుల కోసం తెలియజేసి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వారికి అందించి eKYC తీసుకోవలసి ఉంటుంది.


ఆరోగ్య  శ్రీ  కార్డులు పంపిణీ  వాలంటీర్లు E - KYC సర్వే చేయు విధానం :-

గ్రామ  వార్డు సచివాలయాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ సర్వే చేయుటకు అవకాశం ఉంటుంది. సర్వే చేయు సమయంలో వాలంటీర్లు సిటిజన్ కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డు పై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి.


Step - 1 :- వాలంటీర్ యాప్ ను   ద్వారా  అప్‌డేట్ చేయాలి.

apps

Grama - Ward Volunteer App

version - 7.0.5


Download

ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ సర్వే రిపోర్ట్ ( Dash Board ) Click Here


Step - 2 :- వాలంటీర్ యాప్ యొక్క కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, వాలంటీర్ పైన చూపిన విధంగా అతని/ఆమె నియమించబడిన CFMSIDతో లాగిన్ చేయాలి.


Step - 3 :-  CFMS IDతో లాగిన్ చేసిన తర్వాత, వాలంటీర్ పైన చూపిన విధంగా 

1)బయోమెట్రిక్ 

2) IRIS 

3) ఆధార్ ఫేషియల్ వంటి క్రింది ఎంపికలతో లాగిన్ కావాలి .



Step - 4 :-  Home Page లో "Aarogya Sri" ఆప్షన్ పై టిక్ చేయాలి. 

► Select Type of Search వద్ద Aarogyasri Card Number మరియు Aadhar Card Number. 

► రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ ను   ఎంటర్ చేయాలి.




Step - 5 :-   ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కుటుంబా వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో "Handed Over New Arogya Sri Card to the Family ?

► ( కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ను ఈ కుటుంబానికి అందించారా? ) అందించినట్లయితే Yes అని టిక్ చేయాలి.

► తరువాత వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు కింద చూపిస్తుంది. 

► ఎవరు అయితే అందుబాటులో ఉన్నారో వారి పేరుతో విచ్చేసిన తర్వాత వారి eKYC ను  Biometric / IRIS / Facial ద్వారా తీసుకోవాలి.

Step - 6 :-  ఆ కుటుంబానికి సంబంధించి కార్డు డెలివరీ పూర్తి అయినట్టు అర్థం. ఈ విధంగా వారి కష్టాలు పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారందరికీ కూడా సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.


TrendingMore

Xem thêm