Jagananna Ammavodi Eligibility Rules . How to apply Jagananna Ammavodi scheme.
జగనన్న అమ్మఒడి అప్డేట్
🔹 2021,నవంబర్ 8 నుండి 2022,ఏప్రిల్ 30 వరకు ఉన్న హజరును ప్రామాణికంగా తీసుకుని 75% హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు🔹మొత్తం 130 పాఠశాల పనిదినాల్లో 75%హాజరు ఉండాలి.
JAGANANNA AMMA VODI
జగనన్న అమ్మ ఒడి పధకం ఉద్ధేశం- మీ పిల్లలను మీరు బడికి పంపించండి. బడికి పంపించినందుకుగాను ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15000/- మీ చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నాను.
JAGANANNA AMMA VODI అర్హతలు
- కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ. 10000/- లోపు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 12000/- లోపు కలిగిన వారు అర్హులు.
- తల్లి లేదా సంరక్షుల ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ నంబరు కలిగి ఉండాలి.
- బియ్యం కార్డు లేని కుటుంబాల వారు నిరుపేద / అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునా లేక కాదా 6 అంచేల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి వార్కి కూడా లబ్ధి చేకూరుస్తారు.
- స్వచ్చంద సంస్థల ద్వారా పాటశాలలో మరియు ఇంటర్మీడియట్ కళాశాల్లో చదువుతున్న అనాధ పిల్లలకు కూడా ఈ పధకం వర్తింపచేస్తారు.
- అర్హతకలిగిన తల్లులు లేదా సంరక్షులు వారి పిల్లలకు కనీసం 75% హాజరు ఉన్నదీ లేనిదీ కూడా పరిశీలించి దృవీకరించుకోవాల్సి ఉంటుంది.
- ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లలతో సంబందం లేకుండా అందులో ఒకరికి మాత్రమే పధకం వర్తించేవిదంగా తల్లిని లేదా సంరక్షుని మాత్రమే లబ్ధి దారునిగా గుర్తిస్తారు.
అర్హులైన వారు ధరఖాస్తు చేసుకునే విధానము
- అర్హత కలిగిన కుటుంబము తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డు నకలు కుటుంబ ఆదాయ వివరాలను జత చేసి నిర్ణీత దరఖాస్తును నేరుగా గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వార గానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
- అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.