wb_sunny

Breaking News

వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు - YSR Aarogya Sri

వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు - YSR Aarogya Sri

 వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు



"జనం ఆరోగ్యమే - జగనన్న ఆశయం"
పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యం


అర్హతలు:


🔻 బియ్యం కార్డు, పింఛను కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలకు అర్హులైన వారు ఈ పధకానికి అర్హులు.


🔻 మాగాణి భూమి 12 ఎకరాలు లేదా మెట్ట/మెరక భూమి 35 ఎకరాలు , లేదా మెట్ట మరియు మాగాణి కలిపి 35 ఎకరాల లోపు కలిగినవారు అర్హులు.


🔻 5 లక్షలు లేదా అంతకు తక్కువ కుటుంబ వార్షిక ఆదాయము కలిగిన , వారు అర్హులు.


🔻 5లక్షల లోపు ఆదాయపన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు  అర్హులు.


🔻 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి పింఛనుదారు మినహాయించి మరే ఇతర ఉద్యోగి ప్రభుత్వంలో గానీ లేదా ప్రైవేటుగా గానీ కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్-టైం ఉద్యోగులు, శానిటరీ వర్కర్లు, గౌరవ వేతనం ఆధారంగా పనిచేసే ఉద్యోగులు ఎవరైనా 5 లక్షల లోపు వార్షికాదాయం కలిగియున్న వారు అర్హులు.


🔻 3000 చదరపు అడుగుల (331 Sq. Yds) స్థలం లోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు.


🔻 ఒక కుటుంబానికి/గృహానికి ఒక వ్యక్తిగత కారును మించి ఉండరాదు.


జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:

1 .  అర్హత కల్గిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు, ఆస్తిపన్ను రుజువు, పటాదార్ పాస్ పుస్తకం నకలు, స్వయ మరియు కుటుంబ సభ్యుల జీతం సర్టిఫికేట్ (ఏదైనా ఉంటే), వాహనాలు మరియు ఆస్తి వివరాలు, కుటుంబం యొక్క ఫోటోతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును .


2 . అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్థన ) నెంబర్ ఇవ్వబడుతుంది.


3 . దరఖాస్తు చేసిన 20 రోజులలో అర్హులైన దరఖాస్తుదారునికి డా.వై.యస్.ఆర్, ఆరోగ్య శ్రీ కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది


⛔  సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు  టోల్ ఫ్రీ నెంబర్  1902

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.