wb_sunny

Breaking News

జగనన్న తోడు Jagananna Thodu

జగనన్న తోడు Jagananna Thodu





 జగనన్న తోడు Jagananna Thodu 

చిరు వ్యాపారాలు మరియు సాంప్రదాయ వృత్తి దారుల వ్యాపారాభివృద్ధి కొరకు ” జగనన్న తోడు ” పధకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 10,000/- లోపు సున్నా వడ్డీ తో ప్రభుత్వం రుణం అందిస్తుంది.


చిరు వ్యాపారులు అంటే ఎవరు ? 

సాంప్రదాయ బద్దమైన చేతి వృత్తులను జీవనాధారం గా జీ వించే అల్పాదయ వర్గ ప్రజలు. ఉదా. మగ్గం పని, లేస్ వర్క్స్, కుమ్మరి, కలంకారి , ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ, ఇత్తడి వస్తువులు తయారీ మొదలైనవి ఉత్పత్తి చేస్తూ స్వయంగా అమ్ముకునేవారు.

  • రోడ్డు ప్రక్కన, వీధులలో, బహిరంగ ప్రదేశాలలో, పుట్ పాత్ ల పై మరియు ప్రైవేటు స్థలాలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం చేసుకునేవారు. ( చిరుతిళ్ళు , అంగళ్ళు, చెప్పులు కుట్టేవారు) .
  • సుమారు 5×5  అడుగుల స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాప్ లను ఏర్పాటు చేసుకుని వస్తువులు, సరుకులు అమ్ముకునేవారు.
  • తోపుడు బండ్లు లేదా తలమీద/ భుజం మీద , బుట్టలు / గంపలలో , వస్తువులు / సరుకులను మోస్తూ మరియు వీధులలో సరుకులు / వస్తువులు అమ్ముకునేవారు.
  • ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సైకిల్ , మోటార్ సైకిల్ మరియు చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు / వస్తువులు అమ్ముకునేవారు. (  ఉదా  ఐస్క్రీమ్ , చీరలు,  స్టీలు  సామానులు మొదలగునవి అమ్మేవారు. )

అర్హతలు 

  • 18 సంవత్సరాలు నిండినవారు.
  • నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో ఐతే రూ. 12,000/- లోపు కలిగినవారు.
  • మాగాణి భూములు 3 ఎకరాలు లేదా మెట్ట భూములు 10 ఎకరాలు లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు ఉనవారు.
  • ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డులను ( ఆధార్ కార్డు , ఓటర్ కార్డు లేదా ఇతరములు ) కలిగినవారు.

ధరఖాస్తు చేసుకొనేవిధానము 

  1. అర్హత కలిగినవారు వ్యాపారవివరాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డు తో పాటు స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా గాని ధరఖాస్తు చేసుకోవచ్చును.
  2. అర్హులైన ధరఖాస్తుదారునికి YSR ( Your Service Request మీసేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.


ధరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్ధేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి బ్యాంకుల ద్వారా  సున్నా వడ్డీ తో రూ. 10,000/- లోపు ఋణం ఇప్పించబడును.

లబ్ధి దారులు బకాయి లేకుండా వడ్డితో బ్యాంకునకు నెలసరి కంతులు / వాయిదాలు చెల్లించినయెడల, ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి వడ్డీ ని బ్యాంకునకు చెల్లిస్తుంది.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.