YSR KAPU NESTAM వై యస్ ఆర్ కాపు నేస్తం

YSR KAPU NESTAM   వై యస్ ఆర్ కాపు నేస్తం

How to apply YSR Kapu Nestam,  YSR kapu Nestam Guidelines.


వై యస్ ఆర్ కాపు నేస్తం పధకం క్రింద కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల మహిళల జీవనోపాధి మెరుగుదలకు మరియు ఆర్ధిక స్వావలంబనకొరకు సంవత్సరానికి రూ. 15000/- చొప్పున ఐదు సంవత్సరాలలో రూ. 75000/- ఆర్ధిక సహాయం.

YSR KAPU NESTAM  అర్హతలు 

  • 45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలు.
  • నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ. 10000/- లోపు పట్టణ ప్రాంతాలలో రూ. 12000/- లోపు ఉన్నవారు అర్హులు.
  • కుటుంబానికి 3 ఏకరాలలోపు మాగాణి 10 ఏకరాలలోపు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఏకరాలలోపు ఉన్నవారు అర్హులు.
  • పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణములో ఇల్లు ఉన్నవారు అర్హులు.
  • ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, 4 చక్రాల వాహనము ( ఆటో , టాటా ఎస్ , ట్రాక్టర్లు మినహాయింపు ) కలిగిఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్సనర్లు  అనర్హులు.

 జాబితాలో పేరులేనివారు దరఖాస్తు చేసుకునే విదానం.

  1. అర్హత కలిగిన కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులములకు చెందిన మహిళలు తమ ఆధార్ కార్డు కాపీ, కుల దృవీకరణ పత్రము జత చేసి నిర్ణీత దరఖాస్తును గ్రామ/ వార్డు సచివాలయాలో గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా సంర్పించవలెను.
  2. అర్హులైన ధరఖాస్తు దారునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన  )  నెంబర్ ఇవ్వబడుతుంది.
  3. సలహాలు , సూచనలు మరియు పిర్యాదులకొరకు టోల్ ఫ్రీ నంబరు : 1902

Next Post Previous Post
error: Content is protected !!
×
×