జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెన
జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెన
ప్రెష్ రిజిస్ట్రేషన్:
అర్హతలు:
- ఎస్సీ, ఎస్సి, బిసి, ఇబిసి, కాపు, మైనారిటీ మరియు విభిన్న ప్రతిభావంతులు విద్యార్ధుల యొక్క కుటంబ మొత్తం వార్షిక ఆద్యయం రూ .2.50 లక్షల కన్నా తక్కువ లేదా సమానంగా ఉండాలి.
- కుటంబం మొత్తం యొక్క కమతం 10.00 ఎకరాల తడి (Wet land) లేదా 25.00 ఎకరాల పొడి (Dry land) లేద్య 25.00 ఎకరాల (తడి మరియు పొడి భూమి కలిపి) కంటే తక్కువ ఉండాలి.
- పట్టణ ప్రాంతాలలో, ఆస్తి లేని కుటంబాలు లేదా 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం లో నిర్మించిన భవనం (నివాస లేద్య వాణిజ్య) వారికి అర్హత ఉంది.
- కుటంబ సభ్యులలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు (వారి జీతం / నియామకంతో సంబంధం లేకుండా శానిటరి కార్మికులందరూ అర్హులు),
- కుటంబ సభ్యులలో ఎవరు కూడా స్వంత నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉండకూడదు (టాక్సీలు / ట్రాక్టర్లు / ఆటోలు మినహాయించబడ్డాయి).
- కుటంబ సభ్యులలో ఎవరు కూడా ఆదాయ పన్ను చెల్లింపుదారుడు అయి ఉండరాదు.
- విద్యార్ధి హాజరు 75% లేదా అంత కన్నా ఎక్కువ ఉండాలి.
ఫ్రెష్ దరఖాస్తు నమోదు మరియు మంజూరు ప్రక్రియ
1. అర్హతగల ప్రతి విద్యార్ధి యొక్క దరఖాస్తును కళాశాల జ్ఞానభుమి లాగిన్ నందు నమోదు చేయాలి.
2. కళాశాల యాజమాన్యం త్వరితగతిన దరఖాస్తు చేయని యెడల విద్యార్ధి సంబందిత గ్రామ సచివాలయం నందు దరఖాస్తు చేసుకోనవచ్చును.
3. దరఖాస్తు చేసుకొనుటకు అవసరమగు ద్రువపత్రములు:
a. ssc/10'" Marks memo
b. Student aadhar number
c. Mother aadhar number
d. Caste certificate
e. Income certificate
f. Mother bank account
4. కళాశాలలో/గ్రామ/వార్డ్ సచివాలయములో దరఖాస్తు పూర్తయిన తరువాత వెనువెంటనే బయోమెట్రిక్ వేరిఫికేషన్ పుర్తిచేసుకోనవలెను.
5. ఫ్రెష్ విద్యార్ధులు సమీప గ్రామ/వార్డ్ సచివాలయములో లేదా మీ సేవలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి
చేసుకొనగలరు.
6. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత కళాశాల ప్రధానాచార్యులు ONE TIME
APPROVAL (OTP ద్వారా) చేసి సంబందిత జిల్లా సంక్షేమ అధికారికి ఫార్వర్డ్ చేయవలెను.
7. గడువులోపు దరఖాస్తు చేసుకొని విద్యార్ధులు జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెనకు అర్హులు కారు.
గడువు తేది..
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తే.20-03-2021ది. గడువులోగా విద్యార్ధుల దరఖాస్తులను జ్ఞానభుమి నందు నమోదు చేయని యెడల విద్యార్ధులు మరియు ప్రభుత్వము నుండి ఎటువంటి ఫీజు చెల్లించబడదు, సంబందిత కళాశాల ప్రధానాచార్యులు పూర్తి బాద్యత వహించవలసియుంటుంది.