మే 13న తొలివిడత రైతు భరోసా
మే 13న తొలివిడత రైతు భరోసా
- అర్హత ఉంటే ఇంకా లబ్ధి పొందని వారికి మరో అవకాశం
- దరఖాస్తుకు 30 వరకు గడువు
- గతేడాది 51.59 లక్షల మందికి 6928 కోట్ల సాయం
- ఈ ఏడాది ఇప్పటివరకు 54 లక్షల మంది రైతులకు అర్హత
- తొలి విడత అర్హుల జాబితా మే 10 న వెల్లడి
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖరీఫ్ సాగు నిమిత్తం వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది .
అర్హులైన రైతులకు మే 13న 7500 రూపాయలు చొప్పున తొలివిడత పెట్టుబడి సాయం అందించనుంది .
గతేడాది లబ్ధి పొందిన వారితో పాటు గత రెండేళ్లుగా లబ్ధి పొందని అర్హుల కోసం ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు ఇచ్చింది.
అర్హులు సద్వినియోగం చేసుకోండి
వైఎస్సార్ రైతు భరోసా కింద ఇప్పటివరకు అర్హత పొందని అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ 30లోగా ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు అర్హత పొందిన వారి జాబితాలను ప్రదర్శిస్తున్నారు. వారిలో అనర్హులను గుర్తించి తెలియజేస్తే వారికి లబ్ధి చేకూరకుండా చర్యలు తీసుకుంటాం.
Source :- Sakshi News