ఇంటింటికీ రేషన్ పంపిణీలో వాలంటీర్ల బాధ్యతలు

ఇంటింటికీ రేషన్ పంపిణీలో వాలంటీర్ల బాధ్యతలు


  • తమ క్లస్టర్ పరిధిలోని ఇళ్ళకు రేషన్ పంపిణీ వాహనం ఏ రోజూ, ఏసమయంలో వస్తుందో తెలియజేస్తూ కూపన్లను కార్డుదారులకు అందించాలి.

  •  మొబైల్ వాహనం రావడానికి ఒక రోజు ముందు మళ్ళీ కార్డుదారులందరికీ గుర్తు చేయాలి.

  • ఆ తమ క్లస్టర్ పరిధిలో నిత్యావసరాల పంపిణీ పూర్తయ్యే వరకు వాహనం వద్దే అందుబాటులో ఉండాలి.

  • ఆ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు రెవిన్యూ అధికారులతో సంబంధాలు నెరపాలి.

  • ఇంటింటికీ రేషన్ పంపిణీ సమయంలో మొబైల్ వాహనంలోని ఈ-పోస్ యంత్రాన్ని నిర్వహించాలి.

  • కార్డుదారుల నుండి వేలి ముద్రలను తీసుకోవాలి.

  • ఆ బయోమెట్రిక్ (వేలిముద్రలు పని చేయకపోతే) ప్యూజన్ ఫింగర్  విధానంలో ప్రయత్నించాలి.

  • ఆ రేషన్ తీసుకోని కార్డుదారులు ఎవరైనా ఉంటే ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు గ్రామ, వార్డు సచివాలయం వద్ద రేషన్ వాహనం నిలిపి నిత్యావసరాలు అందిస్తారనే విషయాన్ని సదరు వ్యక్తులకు తెలియజేయాలి.

  • ఆ పోర్టబిలిటీ విధానంలో రేషన్ తీసుకోవడం పై కార్డుదారులకు అవగాహన కల్పించాలి.

  • ఆ తమ నివాస ప్రాంతంలోని వాహనాల వద్దనే రేషన్ తిస్తుకోవాలనే  విషయాన్ని మాపింగ్ కానీ కార్డుదారులకు వివరించాలి.

  • పింఛన్ పంపిణీకి ఇబ్బంది లేకుండా తమ క్లస్టర్ పరిధిలో నిత్యావసరాల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి

Note :-  ఈ మేరకు పైన తెలిపిన అదనపు బాధ్యతలను వాలంటీర్లకు అప్పగిస్తూ ఇటీవలనే గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయాల శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా సూచనలు చేశారు. అలానే సరుకు లోడింగ్, అన్ లోడింగ్, మోసుకెళ్ళడం తదితర పనులేవీ వాలంటీర్లు చేయనవసరం లేదని స్పష్టం చేశారు. మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా పురపాలక కమిషనర్లు, ఎంపీడీఓలకు సూచనలు చేయాలని జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లను కోరారు.

Source :- E latter

Next Post Previous Post
error: Content is protected !!
×
×