FPS డివైస్ ఉపయోగించేటప్పుడు చేయవలసిన పనులు
1. FPS డివైస్ పరికరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. డివైస్ తో పని పూర్తి అయిన తర్వాత లేదా డివైస్ తో పని లేనప్పుడు కేబుల్ పరికరాన్ని సరిగ్గా మడిచి ఉంచుకోవాలి. అవసరం లేనప్పుడు కంప్యూటర్ లేదా మొబైల్ నుండి సెన్సార్ ను డిస్కనెక్ట్ చేయండి.
2. డివైస్ ని ఉపయోగించేటప్పుడు శుభ్రమైన మరియు దుమ్ము లేని వేలిని ఉపయోగించండి. సున్నితమైన ఒత్తిడితో వేలిని క్యాప్చర్ చేయాలి. డివైస్ సెన్సార్ పైన ఎక్కువ దుమ్ము పట్టిన సమయం లో సరైన గ్లాస్ క్లీనర్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ వైబ్స్ వంటి వాటిని సెన్సార్ ను హాని కలిగించకుండా ఉపయోగించండి.
3. డివైస్ పరికరాన్ని సరైన జాగ్రత్తతో బ్యాగ్ లో తీసుకెళ్లండి. పదునైన లోహపు వస్తువులు తాకకుండా ఉండేందుకు బబుల్ బ్యాగ్ లేదా EPE బ్యాగ్ లో తీసుకెళ్లండి.
FPS డివైస్ ఉపయోగించేటప్పుడు చేయకూడని పనులు
1. వర్షంలో డివైస్ పరికరాన్ని ఉపయోగించకండి. అలాగే నీరు/నూనె/మురికి చేతితో డివైస్ ను ఉపయోగించకండి.
2. ఏదైనా అడాప్టర్ ను ఉపయోగించి ముడి విద్యుత్ సరఫరాకు నేరుగా సెన్సార్ ను కనెక్ట్ చేయకండి; సెన్సార్ ను దాని ఆపరేటింగ్ ఓల్టేజ్ కు మించి ఆపరేట్ చేయకండి.
3. బియోమెట్రిక్ డివైజ్ ని బహిరంగంగా తీసుకెళ్లకండి, డివైజ్ కి సరిపోయే పెట్టేను లేదా సంచిని ఉపయోగించండి, ప్రయాణించేటప్పుడు బియోమెట్రిక్ పరికరాన్ని బబుల్ షీట్ కవర్ లో తీసుకెళ్లాలి. బియోమెట్రిక్ పరికరాన్ని రఫ్ గా ఉపయోగించకూడదు.
4. గ్యాసోలిన్ మరియు ఆల్కహాల్ వంటి సేంద్రియ ద్రావకాలను ఉపయోగించి పరికరాన్ని శుభ్రంగా చేయకండి. ఇది పని చేయకపోవడానికి కారణం కావచ్చు.
5. రీడర్ ను ఎప్పుడూ ద్రవంలో ముంచకండి.
6. వేలు క్యాప్చర్ చేసేటప్పుడు స్కానర్ ను గట్టిగా నొక్కకండి. విండో భాగాన్ని కాగితంతో సహా రాపిడి వస్తువులతో ఎప్పుడూ రుద్దకూడదు.
7. మీ వేలి గొరుతో లేదా పెన్ను వంటి ఇతర వస్తువులతో విండో పూతను దుర్చవద్దు.
8. ద్రవాలను నేరుగా సెన్సార్ లేదా డివైస్ పైన పోయకూడదు. ఎందుకంటే ద్రవం లోపలి భాగాలలో ప్రవేశించి నష్టం కలిగిస్తుంది.
Note: బయోమెట్రిక్ డివైస్ పరికరం వాలంటీర్ తప్పిదం వల్ల చెడిపోతే జరిమానా రూ. 500/- కలెక్ట్ చేయబడును. కావున మీ యొక్క బయోమెట్రిక్ డివైస్ ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కోరుచున్నాము.(alert-warning)