Y S R NETHANNA NESTHAM - వైఎస్ఆర్ నేతన్న నేస్తం
New Update:-వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులకు గుడ్ న్యూస్..అర్హత ఉండి మిస్ అయిన వారికి మరో నెల రోజులు గడువు కల్పించిన ముఖ్యమంత్రి.. లబ్ధిదారులు నేరుగా సచివాలయం లో లేదా వాలంటీర్ సహకారంతో అప్లై చేసుకోవచ్చు.
పథకం యొక్క ముఖ్య ఉద్దేశం :-
చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడం.మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న చేనేత కార్మికులకు మరింత తోడ్పాటునివ్వడం.
ప్రయోజనాలు :-
➤ సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి 24 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం
➤ కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న నేతన్నలకి కావలసిన ముడి సరుకు, ఇతర అవసరాలను తీర్చడానికి గానూ ఆర్థికంగా చేయూతనివ్వడం
అర్హతలు :-
➤ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కుటుంబాలలోని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
➤ సొంత మగ్గం కలిగి ఉండి దానిపై పన చేస్తూ జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
➤ కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్న ఒక్క మగ్గానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
➤ కొత్తగా ఏర్పాటు చేసిన మగ్గంపై సంవత్సరం పాటు పని చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుంది.
అనర్హతలు :-
➤ ప్రాథమిక చేనేత సంఘాల్లోనూ మరియు మాస్టర్ వీవర్స్ షెడ్లలో పనిచేస్తున్న చేనేత కార్మికులకు ఈ పథకం వర్తించదు.
➤ చేనేత అనుబంధ వృత్తులలో ఉన్న కార్మికులు ఈ పథకం ద్వారా సహాయం పొందడానికి అనర్హులు. (ఉదా: నూలు వడుకువారు, పడుగు తయారు చేయువారు, అద్దకం పనిచేయువారు, అచ్చులు అతికేవారు మొదలైన వారు అనర్హులు)
కావలసిన పత్రాలు :-
1 . స్థిరనివాస ధ్రువీకరణ పత్రం.2 . రాష్ట్ర చేనేత సంఘం జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ.
3 . బ్యాంకు ఖాతా పుస్తకం.
4 . తెల్లరేషన్ కార్డు,
5 . ఆధార్ కార్డు మరియు ఓటరు కార్డు వంటి గుర్తింపు పత్రాల కాపీలను కూడా కలిగి ఉండాలి.
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకొనే విధానం :-
➤ అర్హత కలిగిన చేనేత కార్మికులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం మరియు బియ్యం కార్డు/ తెల్ల రేషన్ కార్డు నకలు పత్రాలతో జత చేసిన దరఖాస్తులను గ్రామ! వార్డు సచివాలయాల్లో స్వయంగా కానీ లేదా గ్రామ! వార్డు వాలంటీర్ల ద్వారా గానీ సమర్పించవలెను.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి కొత్తగా వచ్చిన దరఖాస్తు పత్రం నవశకం వెబ్సైటులో అందుబాటులో ఉంది.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి కొత్తగా వచ్చిన దరఖాస్తు పత్రం నవశకం వెబ్సైటులో అందుబాటులో ఉంది.
➤ అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్ధవ) నెంబర్ ఇవ్వబడుతుంది..
➤ కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతగల చేనేత కుటుంబాలను నిర్ధారించడానికి గ్రామ/వార్డు వాలంటీర్లు క్షేత్ర సందర్శన చేయవలెను.
➤ క్షేత్రసందర్శన పూర్తయిన పిమ్మట కలిగిన చేనేత కుటుంబాల జాబితాను సచివాలయంలో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శికి అప్పగించవలెను.
➤ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసుకున్న తర్వాత పొందిన లబ్ధిదారుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయంలో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించవలేను.
➤ కొత్త దరఖాస్తులలోని లబ్ధిదారులు మరియు గతంలో లబ్ధి పొందిన లబ్ధిదారులపై వచ్చిన అభ్యంతరాలను పూర్తి చేసి తుది జాబితాను సిద్ధంచేయాలి.
➤ తుది జాజతాను మండలాలలో MPDO మరియు మునిసిపాలిటీలలో Municipal Commissioner కు ప్రభుత్వం సూచించిన గడువులోపు సమర్పించవలెను.
➤ దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ.24000 లను ఒకసారి మంజూరు చేసే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.