Ads Area

ఈ - క్రాప్ బుకింగ్ ( E - Crop Booking )


 ఈ - క్రాప్ బుకింగ్  ( E - Crop Booking )

పంట వేసి.. కోతకొచ్చే వరకు దిగుబడులపై నమ్మకం ఉండదు. అకాల
వర్షాలు.. కరవు పరిస్థితులు ప్రభావం చూపుతుండగా... రైతన్నలు నిండా మునుగుతున్నారు.
ఇలాంటి సమయంలో వారికి ప్రభుత్వం తోడ్పాటు అందాలంటే పంట నమోదు తప్పనిసరిగా మారింది 


రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలి. అప్పుడే వరదలు, కరవు కాటకాల సమయంలో ఏదైనా నష్టం జరిగితే.. ప్రభుత్వం నుంచి ఇన్పుట్ రాయితీ అందే అవకాశం ఉంది. పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నా, పంటల బీమా అమలు కావాలి  అన్నా.. సున్నా వడ్డీకి పంట రుణాలు అమలు చేయాలన్నా, పచ్చిరొట్ట విత్తనాలు పొందాలన్నా.. ఈ క్రాప్  ( E - Crop ) లో నమోదు తోడ్పడుతుంది. పెరిగినసాగు ఖర్చుల నేపథ్యంలో ప్రభుత్వం అందించే సాయం అందేందుకు ఉపయుక్తంగా మారుతుంది. 


రైతులకు తెలియ జేయడం ఏమనగా

E-క్రాప్ 2021-22 సంబందించి పంట నమోదు ప్రక్రియ మొదలయింది... కావున రైతులు అందరు సచివాలయ వ్యవసాయ సహాయకులు సంప్రదించి తమ పంట నమోదు చేయించుకోగలరు...

ఉపయోగాలు :-
పంట గవర్నమెంట్ కు అమ్ముకోవాలన్న
పంట నష్ట పరిహారం పొందాలన్న
రైతు భరోసా పడాలన్న
గిట్టుబాటు ధర పొందాలన్న
E. Crop తప్పనిసరి  

ఖాతా నెంబర్ / సర్వే నెంబర్ వారీ ఈ - క్రాప్ బుకింగ్ అయిందో లేదో తెలుసుకొనే లింక్  :-





1 . మొదట గా క్రాఫ్ట్ ఇయర్ ను  RABI - 2020  సెలెక్ట్ చేసుకోవాలి 


2 . తరువాత  జిల్లా  ను సెలెక్ట్ చేసుకోవాలి


3 . తరువాత  మండలం  ను  సెలెక్ట్ చేసుకోవాలి


4.  తరువాత   గ్రామం ను సెలెక్ట్ చేసుకోవాలి


5.  తరువాత   సర్వే నంబర్  లేదా  ఖాతా నెంబర్  ను సెలెక్ట్ చేసుకోవాలి


6 . తరువాత  సర్వే నెంబర్  లేదా   ఖాతా నెంబర్  ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి






రైతు శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తూ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగానే పథకాలను రైతులకు మరింత చేరువ చేయడానికి చేపట్టిన ఈ–క్రాప్‌ నమోదు భీమవరం నియోజకవర్గంలో వేగంగా జరుగుతోంది. ఈ–క్రాప్‌ ద్వారా గ్రామాల్లో పండించిన అన్నిరకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ, పశుగ్రాసం, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, వైఎస్సార్‌ సున్నావడ్డీ, పంట రుణాలు, వైఎస్సార్‌ ఉచిత పంట బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటివి దక్కుతాయి.



Below Post Ad

Ads Area

Don't Try to copy, just share