one-time settlement scheme to benefits - జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకము


One-Time Settlement scheme to benefits  - జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకము

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్ళ పై సర్వ హక్కులు మరియు ప్రభుత్వము ద్వారా రిజిస్టర్డ్ దస్తావేజు పొందుటకు జగనన్న కల్పిస్తున్న సదావకాశమే “జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకము". గృహనిర్మాణ సంస్థ గృహాలు నిర్మించుకొనుటకు లబ్ధిదారులకు ఋణాలు మంజూరు చేసేది. అట్టి ఋణమును తిరిగి వాయిదాల పద్ధతులలో లబ్ధిదారులు వడ్డీతో సహా చెల్లించవలసి వచ్చేది.


2014వ సంవత్సరానికి ముందు జరిగిన ఏక కాల పరిష్కారం (OTS) జరిగినప్పటికి కేవలము వడ్డీ మాత్రమే మాఫీ అయి అసలు కట్టవలసి వచ్చేది. తాకట్టులో ఉన్న కాగితాలను తిరిగి ఇచ్చినప్పటికి సదరు ఇంటి స్థలము పై ఎలాంటి హక్కులు కల్పించబడలేదు. 2014 సంవత్సరం తరువాత అయితే ఏ ఒక్క ఋణ గ్రహీతకు ఏక కాల పరిష్కారం అమలు కాలేదు. పేదప్రజల సాధక బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించిన అతి తక్కువ మొత్తమును ఏక కాలములో చెల్లించిన వారికి ఋణ మాఫీతో పాటు వారి స్థిరాస్తి పై సర్వ హక్కులను కలుగజేయాలనే సదుద్దేశ్యంతో జగనన్న ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయతలపెట్టినది.

విధివిధానాలు

 రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఋణములు పొంది ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు

ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.


ఇంటికి చెల్లించవలసిన మొత్తము వివరములు :

No. రుణ గ్రహీతలు చెల్లించాల్సిన రుసుం
1 గ్రామీణ ప్రాంతములో రూ.10,000/-లు
2 పురపాలక సంఘం ప్రాంతములో రూ.15,000/-లు
3 నగరపాలక సంస్థ ప్రాంతంలో రూ.20,000/-లు


ఈ పధకపు ప్రయోజనాలు :-

* పై తెలిపిన తక్కువ మొత్తం చెల్లించి, పూర్తి ఋణ మాఫీ పొందటం.
* మీ స్థిరాస్తిని రిజిస్టర్ చేసుకోవడం ఇక సులభతరం - సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరీక్షణకు ఇక శెలవు.
* ఆస్థిని అమ్ముకొనుటకు గాని, తనఖా పెట్టుకొనుటకు వీలుగా 22(A) (1)(a) నిషేధిత జాబితా నుండి తొలగింపు.
* ఆర్ధిక సంస్థలు లేదా బ్యాంకు రుణాలకు జామీను కింద దఖలు పరుచుకోవచ్చు.

* ప్రభుత్వము నిర్ణయించిన ఏక మొత్తము కంటే, లబ్ధిదారులు గృహనిర్మాణ సంస్థ ద్వారా పొందిన ఋణము అసలు మరియు వడ్డీతో కలిపిన మొత్తము తక్కువైనచో, ఆ మేరకు మాత్రమే చెల్లించవచ్చును. ఈ పథకమునకు అర్హులైన లబ్ధిదారుల వివరములు గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు సంబంధిత గ్రామ/ వార్డు సచివాలయాలలో APPLY చేసుకోవచ్చును. 



* లబ్ధిదారులకు ఎంతగానో మేలు చేసే ఈ పథకము ఈ సంవత్సరం డిసెంబర్, 20వ తేది వరకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబడుతుంది.
* నిర్దేశించిన మొత్తమును చెల్లించిన వారికి ఋణమాఫీతో పాటు ఇంటి రిజిస్టర్డ్ దస్తావేజులు డిసెంబర్ 21వ తేదినుండి అందజేయబడతాయి.
కావున అర్హులైన లబ్ధిదారులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని సంపూర్ణ హక్కును పొందవలసినదిగా కోరుతున్నాము

-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ  సంస్థ



Share this post with friends

See previous post See next post
error: Content is protected !!