
Aadudam Andhra - ఆడుదాం ఆంధ్ర :-
ఆంధ్రప్రదేశ్‌లో 50 రోజుల క్రీడా సంబరాలకి ఈరోజు నుంచి తెరలేచింది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఐదు క్రీడల్లో పోటీలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఈరోజు నుంచి గ్రామ/ వార్డు సచివాలయాల్లో పేర్ల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయి.
ఆడుదాం ఆంధ్ర Citizen Registration link :-
ఆడుదాం ఆంధ్ర Citizen Registration User Manual :-
15 డిసెంబర్, 2023 నుండి 3 ఫిబ్రవరి, 2024 వరకు గ్రామ/వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు.
🏆ఆడుధాం ఆంధ్ర సమాచారం
1) ఆడుదాం ఆంధ్ర పోటీలు ఏ స్థాయిలో నిర్వహిస్తారు?
𝐀𝐍𝐒: గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తారు.
2) ఏ ఏ క్రీడలకు పోటీలు కలవు?
𝐀𝐍𝐒: క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్.
3) పోటీలు పురుషులకు మాత్రమేనా?
𝐀𝐍𝐒: అన్ని క్రీడలలోనూ స్త్రీలకు కూడా ప్రవేశం కలదు.
4) Registration ఎక్కడ చేసుకొవాలి?
𝐀𝐍𝐒: కింద ఉన్న link ద్వార కానీ,1902 కి phone చేసిగాని లేదా మీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో కూడా చేసుకోవచ్చు
5) Registration ఎప్పటి నుంచి మొదలవుతుంది?
𝐀𝐍𝐒: 27 నవంబర్ 2023 నుండి 13 డిసెంబర్ 2023 వరకు.
6) పోటీలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?
𝐀𝐍𝐒: గ్రామస్థాయి పోటీలు 15 డిసెంబర్ 2023 న మొదలయ్యి రాష్ట్రస్థాయి పోటీలు 24 జనవరి 2024 ముగుస్తాయి.
7) పోటీలో పాల్గొనటానికి కనీస వయసు ఎంత?
𝐀𝐍𝐒: 15 సంవత్సరములు.
8) నగదు బహుమతి ఎంత?
𝐀𝐍𝐒:
నియోగికవర్గం స్థాయి:
🥇1st: 20,000/-,🥈2nd: 10,000/-
జిల్లా స్థాయి:
🥇1st: 1,00,000/-, 🥈2nd: 50,000/-
రాష్ట్ర స్థాయి:
🥇1st: 5,00,000/-, 🥈2nd: 3,00,000/-
9) Registration కు కావలసినవి?
𝐀𝐍𝐒: Aadhar Card, Id card కోసం photo, mobile number.
10) ఎవరి ఊరితరుపున వారు పోటీ చేయవచ్చా లేక ఎక్కడైనా పోటీ చేయవచ్చా?
𝐀𝐍𝐒: ఆటగాడు గ్రామంలో శాశ్వత నివాసం కావచ్చు లేద తాత్కాలికంగా గ్రామం/పట్టణం లో ఉండిఉండవచ్చు లేద గ్రామంలో చదువుకోసం ఉండిఉండవచ్చు. కేవలం ఆటకోసం గ్రామానికి వస్తే అనర్హులు.
11) ప్రభుత్వ ఉద్యోగులు పోటిచేయవచ్చా?
𝐀𝐍𝐒: ప్రభుత్వ ఉద్యోగులు మరియు వాలంటీర్లకు ప్రవేశం లేదు.
12) ఒక క్రీడాకారుడు ఎన్ని క్రీడలలో పోటీ చేయవచ్చు?
𝐀𝐍𝐒: రెండు.
13) క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్ కాకుండా ఇంకా ఏమైన ఆడవచ్చ?
𝐀𝐍𝐒: 2/3 కిలోమీటర్ల పరుగు పంధ్యం , యోగ, ట్టెన్నికాయిట్, వేరే ఇతర ప్రాంతీయ క్రీడలు వంటివి ఆడవచ్చు కానీ వీటికి పోటీలు బహుమతులు ఏమీ ఉండవు కేవలం కాలక్షేపం కోసం మాత్రమే జరుగుతాయి.