SSC GD Constable: ‘పది’ అర్హతతో 26,146 ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ వేతనం- GVWV News
SGD Constable Notification 2023:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (SSC GD Constable), రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 24 నుంచి ప్రారంభమైంది.
Organization Name | Staff Selection Commission |
Post Name | Constable (General Duty) |
Total Post | 26,146 |
Job Location | All India |
Apply Mode | Online |
Official Website | ssc.nic.in |
మొత్తం పోస్టుల సంఖ్య: 26,146
బీఎస్‌ఎఫ్- 6174
సీఐఎస్‌ఎఫ్- 11025
సీఆర్‌పీఎఫ్ - 3337
ఎస్‌ఎస్‌బీ - 635
ఐటీబీపీ - 3189
ఏఆర్ - 1490
ఎస్‌ఎస్‌ఎఫ్ - 296
అర్హత: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి : 01.01.2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి.
వీటిలో జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్-20 ప్రశ్నలు-40 మార్కులు,
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవర్‌నెస్-20 ప్రశ్నలు-40 మార్కులు,
ఎలిమెంటరీ మాథమెటిక్స్-20 ప్రశ్నలు-40 మార్కులు,
ఇంగ్లిష్/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి.
పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
Notification out | November 18 |
Application Start Date | November 24 |
Application Last Date | December 28 |
Last date to pay application fee | December 29 |
Exam Date | ఫిబ్రవరి - మార్చి, 2024 |
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్ 24, 2023
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31, 2023
ఫీజు చెల్లించడానికి చివరితేది: జనవరి 1, 2024
దరఖాస్తుల సవరణకు అవకాశం: జనవరి 4, 2024 నుంచి జనవరి 6, 2024 వరకు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఫిబ్రవరి - మార్చి, 2024
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
Importent Links :-