ఈ ఏడాది ‘సేవా మిత్ర’కూ రూ.20వేలు - GVWV News

 


Volunteer Awards  2024 :-

 ఈ ఏడాది ‘సేవా మిత్ర’కూ రూ.20వేలు


♦ వాలంటీర్లకు వందనం(వాలంటీర్ అవార్డ్స్) కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.


♦ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 


♦ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 3లక్షల మందికి పైగా వాలంటీర్లు సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారు. 


♦ ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం ‘వలంటీర్లకు వందనం’ పేరుతో ప్రతి ఏటా సత్కరిస్తోంది. 


♦ అయితే ఇటీవల వాలంటీర్ల జీతాలు పెంచిన జగన్ సర్కార్.. తాజాగా మరో శుభవార్త చెప్పింది. 


♦ ప్రతి ఏడాది సేవా వజ్ర కింద రూ.30వేలు, సేవా రత్న కింద రూ.20వేలు, సేవా మిత్ర రూ.10వేలు ఇస్తుండగా.. ఈసారి సేవా మిత్రకు కూడా రూ.20వేలు ఇవ్వనుంది.


Share this post with friends

See previous post See next post
error: Content is protected !!