To Day News - నేటి వార్తలు (18 . 04 . 2024) - GVWV News

  To Day News  -   నేటి వార్తలు (18 . 04 . 2024) - GVWV News




✅నేటి ప్రత్యేకత:


► అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం


🌍 అంతర్జాతీయ వార్తలు :


 ► పచ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం కాగా అంతర్జాతీయ విమానాశ్రయంలో వరద నీరు చేరి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.


►  పాకిస్తాన్ లో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో బుధవారం నాడు 14 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 63 కు చేరిందని అధికారులు వెల్లడించారు.


►  ఉక్రెయిన్ లోని చెర్నివ్ నగరంపై నిన్న రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఒక ఎనిరిమిది అంతస్తుల అపార్ట్మెంటులోని 17 మంది మృతి చెందగా 61 మంది గాయపడ్డారు.


►  మయన్మార్ కీలక నాయకురాలు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ ని ఆరోగ్యం దృష్ట్యా ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహనిర్బంధానికి మార్చింది.


►  తగినంత నిద్ర వ్యాయామం తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్ లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగుతుందని ఫిన్లాండ్ లో నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.


► ఇరాన్ పై ప్రతీకార దాడి ఎప్పుడు ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.


►  ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ టైం మ్యాగజిన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. 



🈁 జాతీయ వార్తలు :


►  దేశంలో యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీఏ పాలనలో దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) 86 రెట్లు ఎక్కువగా సోదాలు నిర్వహించినట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పి టి ఐ) విశ్లేషణ నివేదిక విడుదల చేసింది.


► చత్తీస్గడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం నాడు పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించగా పెద్ద ఎత్తున తుపాకులు ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


►  ఉద్యోగులు కార్మికులు వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్స్ క్లెయిమ్ పరిమితిని రూ 50 వేల నుంచి ఈపీఎఫ్ ఓ పెంచింది.


►  దేశ జనాభా ఈ ఏడాది చివరికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యు ఎన్ ఎఫ్ పీ ఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది.


► ఉజ్బెకిస్తాన్ లో భారత విదేశీ వ్యవహారాల శాఖ యురేషియా ఇనిషియేటివ్ కింద రూ.8.5 కోట్లతో నిర్మించిన అత్యాధునిక సమాచార సాంకేతిక (ఐటీ) ప్రయోగశాలను భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నిన్న ప్రారంభించారు.



🈴  రాష్ట్ర వార్తలు :


► రాష్ట్రంలోని 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలలో ఎన్నికల నిర్వహణకు నేటి ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా తెలియజేశారు.


► గృహ నిర్మాణ సంస్థ ఎండి వెంకటరమణారెడ్డి ఆరోగ్యపరమైన కారణాలతో నెలరోజుల పాటు సెలవు వెళ్ళగా ఆ స్థానంలో గిరీషా ను ఎండిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.


► ఈ విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఈ సమావేశాన్ని పాఠశాలల పునః ప్రారంభం రోజు అయిన జూన్ 12న నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలియజేశారు.


► రాష్ట్రంలో రోజురోజుకీ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా నిన్న అత్యధికంగా 16 జిల్లాలలో 43 డిగ్రీలకు పైగా నమోదయినట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.


► ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులకు నేటి నుంచి పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.


► 2023-24 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో రూ.20,339 కోట్ల ఆదాయం సాధించినట్లు ఇప్పటివరకు ఇదే అత్యధికమని రైల్వే అధికారులు ప్రకటించారు.


⛳  క్రీడావారలు - Sports :


► ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది.


► టైమ్స్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది.

error: Content is protected !!