గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్ట్ 15 నాటి నుండి నేటివరకు(2023-24) ఆయా సెక్రటరీలకు సంబంధించి మేము ప్రజలకు చేసిన పనులు
💥 గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్ట్ 15 నాటి నుండి నేటివరకు(2023-24) ఆయా సెక్రటరీలకు సంబంధించి వాలంటీర్లు ప్రజలకు చేసిన పనులు
🔵 "𝗣𝗦-𝗔𝗗𝗠𝗜𝗡" - ఇంటి పన్ను, కుళాయి పన్నుకి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం, ఏటేటా కట్టవల్సిన మనీ ని ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం. ఎవరికైనా అస్సెస్మెంట్ లేకపోతే దానికి సంబంధించిన డాకుమెంట్స్ కలెక్ట్ చేయడం, ఇంటింటికి పోయి కొలతలు కొలచి వ్రాయడం, ఇంటింటికి వెళ్లి గోడలు మీద అస్సెమెంట్స్ నంబర్లు వ్రాయడం..Etc
🔵 "𝗠𝗔𝗛𝗜𝗟𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘" - ఇంటింటికి వెళ్లి దిశ యాప్ ఇన్స్టాల్ చెహించాము, కోవిడ్ టైం లో గ్రామ చివార్లలో డ్యూటీస్, ఇంటింటికి అగ్రిగోల్డ్ సర్వే, 9-19 సంవత్సరాలు ఆడపిల్లల డేటా, పండుగ సమయాల్లో డోర్ లాక్ సమాచారం, అక్రమంగా జరిగించే వాటి గూర్చి సమాచారం ఇవ్వడం.Etc
🔵 "𝗔𝗡𝗠" : కొన్ని రకాల వ్యాధులకు టాబ్లెట్లు ఇవ్వడం, ఎవరికి ఇచ్చాం అనేది డేటా వ్రాయడం, బీపీ,షుగర్ సమాచారం, ఎన్ని సర్వేలు చేసిన ఆ ఇంటి గోడలు మీద తేదీ వ్రాయడం, ప్రతి వారం DRY DAY ప్రోగ్రాం, 0-19 సంవత్సరం పిల్లలు డేటా సేకరణ, కోవిడ్ టైం లో వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ వచ్చినవారికి టాబ్లెట్లు పంపిణీ, 50 సార్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే, PMJAY రిజిస్ట్రేషన్ or అభ కార్డు రిజిస్ట్రేషన్, కుష్టు వ్యాధి సర్వే, మాస్కులు పంపిణీ, పైలెరియా టాబ్లెట్ పంపిణీ, NCD-CD సర్వే,Etc
🔵 "𝗣𝗟𝗔𝗡𝗡𝗜𝗡𝗚 - 𝗦𝗨𝗥𝗩𝗘𝗬𝗢𝗥" : డ్రైనేజీ లేనివారికి గుంతలు కావాలా/వద్దా సేకరణ, అక్రమంగా కట్టే వాటివి/ బోర్డులు గూర్చి సమాచారం, క్లస్టర్ మాప్పింగ్ గీసి ఆ ప్రకారం డోర్ నంబర్స్ వ్రాసి ఇవ్వడం, క్రొత్త ఇల్లు యొక్క కొలతలు కొలవడం, స్కూల్ మరమ్మతులు నోట్ చేసుకోవడం, ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే చూసి చెప్పడం..Etc
🔵 "𝗔𝗠𝗘𝗡𝗜𝗧𝗜𝗘𝗦 - 𝗘𝗡𝗚𝗜𝗡𝗘𝗘𝗥𝗜𝗡𝗚 𝗔𝗦𝗦𝗜𝗦𝗧𝗔𝗡𝗖𝗘" : క్రొత్త కుళాయి, టాయిలెట్ అవసరమైన వారిని గుర్తించి కనెక్షన్ కోసం డాక్యుమెంట్ ఇవ్వడం, విద్యుత్ స్తంభాలు నంబర్లు వ్రాసి ఇవ్వడం, రోడ్లు సమాచారం, ఏ ఇంటిలో కుళాయి సరిగ్గా రావడం లేదో గుర్తించడం..Etc
🔵 "𝗙𝗜𝗦𝗛𝗘𝗥𝗜𝗘𝗦" : చేపలు చెరువులు ఎంతమంది ఉందో సర్వే, సొంతగా HUB కావాలన్న వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కలెక్ట్ చేసి ఇవ్వడం.Etc
⭕ అయ్యా, శ్రీ సీఎం నారా చంద్రబాబు గారికి, అయ్యా, డిప్యూటీ సిఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా మనవి ఏమనగా "వాలంటీర్లు కేవలం పింఛన్ కి, రేషన్ పంపిణీకి & నవరత్నాలకు మాత్రమే మేము పరిమితం కాలేదు. మేము 5000/- లుకే ఎన్నో ఎన్నెనో సర్వేలు, పనులు చేశాం. కొన్ని చోట్ల వేతనం లో కటింగ్ చేసే పరిస్థితులు కలవు
మా 2లక్షల 60వేల మంది నిరుద్యోగులను(రాజీనామా చేసిన వారిని/ చెయ్యని వారిని) యందు దయచూపి, మా కష్టాలు గుర్తించి, ఈ వ్యవస్థను కొనసాగించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా విజ్ఞప్తి చేస్తున్నాం