Ads Area

AP Free Sand - 2024 : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి, మార్గదర్శకాలు జారీ - GVWVNews

 


AP Free Sand - 2024 - ఉచిత ఇసుక విధానం  :-


జులై 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్నిచోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక అందిస్తారు. నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు ₹20, సీనరేజ్ కింద టన్నుకు ₹88 వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీ చేస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది.


🟢 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కొత్త ఇసుక పాలసీను రూపొందిస్తూ ప్రభుత్వం ఖరారు చేసిన విధివిధానాల జీవో 👇



ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే ?


  • ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి. 


  •  అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు. 


  •  ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి. 


  •  స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.


  •  www.mines.ap.gov.in వెబ్ సైట్ లొ ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉందొ తెలుసుకోవచ్చు. 


.


Below Post Ad

Ads Area

Don't Try to copy, just share