2021 - 2022 ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ పథకాల షెడ్యూల్
సంక్షేమ క్యాలెండర్ కు మంత్రివర్గ ఆమోదం
నవరత్నాల అమలుకు సంబంధించి 2021-22 సంవత్సర క్యాలెం డరు మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కొక్కరికీ ఒకటికి మించి ఆందే పథకాల ద్వారా.. మొత్తం 12 కోట్ల సంక్షేమ ఫలాలు అందనున్నాయి. ఈ పథకాలతోపాటు వైఎస్సార్ లా నేస్తం కింద ప్రతినెలా 2102 మంది, జగనన్న గోరు ముద్ద ద్వారా 36.88 లక్షలు, సంపూర్ణ పోషణ ద్వారా 30.16 లక్షలు, ఇమామ్, మౌజమ్ లకు ఆరికసాయం కింద 77230 మందితోపాటు మిగిలిపోయిన అర్హులకు ఇళ్లపట్టాల పంపిణీ, నెలవారీ ఇంటింటికీ రేషన్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- ఏప్రిల్ 2021: జగనన్న వసతి దీవెన పథకం కింద 15లక్షల మందికి పైగా విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీల చెల్లింపు
- ఏప్రిల్ 2021: జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగు విడతలుగా (ఏప్రిల్-జూలై డిసెంబర్-ఫిబ్రవరి) సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు, 18లక్షల 80వేల మందికి లబ్ది.
- ఏప్రిల్ 2021: రైతులకు వడ్డీలేని రుణాలు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 66.11 లక్షల మందికి వడ్డీలేని రుణాలుు
- ఏప్రిల్ 2021: 90.37లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
- మే 2021: పంటల బీమా కింద రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రైతులకు బీమా చెల్లింపు.
- మే 2021: రైతు భరోసా పథకం కింద మూడు దఫాలుగా (మేఅక్టోబర్-జనవరి) 54 లక్షల మందికి రైతులకు లబ్ది.
- మే 2021: మత్స్యకార భరోసా కింద 1.09 లక్షల మందికి ఆర్ధిక సాయం.
- మే 2021: లో మత్స్యకార భరోసా పథకం కింద 19వేల పడవలకు డీజిల్ నట్సడి.
- జూన్ 2021: జగనన్న విద్యాకానుక పథకం కింద 42 లక్షల మందికి బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ
- జూన్ 2021: వైఎస్ఆర్ చేయూత పథకం కింద 24 లక్షల మందికి రూ.17,250 చొప్పున ఆర్థిక సాయం,
- జూలై 2021: వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పథకం కింద 2 లక్షల మందికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం.
- జూలై 2021: వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 3.27లక్షల మందికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం.
- ఆగస్టు 2021: 25 లక్షల మంది రైతులకు వడ్డీలేని రుణాలు.
- ఆగస్టు 2021: 9వేల ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు,
- ఆగష్టు 2021: నేతన్న నేస్తం పథకం కింద 81 వేల మందికి ఆర్థిక సాయం.
- ఆగస్టు 2021: 3లక్షల 34వేల మంది మంది అగ్రిగోల్డ్్ బాధితులకు చెల్లింపు
- సెప్టెంబర్ 2021: వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 87లక్షల మంది మహిళలకు రుణమాఫీ చెల్లింపులు,
- అక్టోబర్ 2021: జగనన్న తోడు పథకం కింద 9.05లక్షల మందికి సాయం.
- అక్టోబర్ 2021: జగనన్న చేదోడు పథకం కింద టైలర్లు, రజకులు, నాయి. బ్రాహ్మణులకు ఆర్థిక సాయం... 2.95లక్షల మందికి లబ్ది.
- నవంబర్ 2021: అగ్రవర్ణాల పేద మహిళలకు ఈసీబీ నేస్తం పథకం కింద రూ.15వేలు ఆర్ధిక సాయం. 6 లక్షల మంది లబ్దిదారులు ఉంటారని అంచనా.
- జనవరి 2022: జగనన్న అమ్మఒడి పథకం కింద 44లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం