వైఎస్ఆర్ పెళ్లి కానుక
( వైఎస్సార్ పెళ్లి కానుక )
వైఎస్ఆర్ పెళ్లి కానుక
*ఉద్దేశం*:-
రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా, పెళ్లి కుమార్తె అయి అత్తరింటికి వెళ్లిన తర్వాత కూడా అభద్రత భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్ళికానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహము రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువు కి రక్షణ కల్పించడం*వైయస్సార్ పెళ్లి కానుక* రూపకల్పన ముఖ్య ఉద్దేశం.
*పథకం యొక్క మార్గదర్శకాలు*
1. మండల సమాఖ్య/మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
2 . అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.
3 . వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లి కుమార్తె బ్యాంక్ ఖాతాలో వేస్తారు.
4 . వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
5 . అనంతరం వివాహ దృవీకరణ పత్రం ఇస్తారు.
అర్హతలు
1 . వధువు మరియు వరుడు ఇద్దరు ప్రజాసాధికారిక సర్వే నందు నమోదు కాబడి ఉండాలి(వాలంటీర్ నందు HOUSEHOLD సర్వే చేసుకోవాలి.. దీనికి - మార్గ దర్శకాలు రావలసి ఉంది).
2 . వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
3 .వధువు మరియు వరుడు ఇద్దరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
4 . వధువు కచ్చితంగా తెల్ల రేషన్కార్డు కలిగి ఉండాలి.
5 . వివాహ తేదీ నాటికి వధువుకు 18 సంవత్సరాలు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
6 . కేవలం మొదటి సారి వివాహం చేసుకునేవారు మాత్రమే ఈ పథకం కు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పథకమునకు దరఖాస్తు చేసుకోవచ్చును.
7 . వివాహము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరగవలెను.
ప్రోత్సహకం
1 . వైఎస్ఆర్ పెళ్లి కానుక (ఎస్సీ) సాంఘిక సంక్షేమ శాఖ-40,000/-
2 . వైయస్సార్ పెళ్లి కానుక (ఎస్సీ కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ-75,000/-
3 . వైయస్సార్ పెళ్లి కానుక (గిరిపుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ-50,000/-
4 . వైయస్సార్ పెళ్లి కానుక (ఎస్టీ కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ-75,000/-
5 . వైయస్సార్ పెళ్లి కానుక (బిసి) బీసీ సంక్షేమ శాఖ-35,000/-
6 . వైయస్సార్ పెళ్లి కానుక (బి సి కులాంతర) బిసి సంక్షేమ శాఖ-50,000/-
7 . వైయస్సార్ పెళ్లి కానుక (dulhan) మైనార్టీ సంక్షేమ శాఖ-50,000/-
8 . వైయస్సార్ పెళ్లి కానుక (దివ్యాంగులు) దివ్యాంగుల సంక్షేమ శాఖ-1,00,000/-
9 . వైఎస్ఆర్ పెళ్లి కానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000/-
కావలసిన డాక్యుమెంట్స్
1 . కులము - కమ్యూనిటీ మరియు జనన దృవీకరణ పత్రము.
2 . వయసు - ఎస్ఎస్సి సర్టిఫికెట్ 2004 వ సంవత్సరం మరియు ఆ తరువాత పదవ తరగతి పాస్ అయిన వారికి(లేదా) డేట్ ఆఫ్ బర్త్(లేదా) ఆధార్ కార్డ్.
3 . ఆదాయము (వధువు కి మాత్రమే) - తెల్ల రేషన్ కార్డు/ఇన్కమ్ సర్టిఫికెట్.
4 . నివాసం - ప్రజా సాధికారిక సర్వే నందు నమోదు/హౌస్ హోల్డ్ సర్వే.
5 .అంగవైకల్యం - సదరం సర్టిఫికెట్ ( కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
6 . వితంతువు - ఆధార్ నెంబర్ ఆధారముగా ఫించన్ డేటాతో పరీసీలిస్తారు.
వితంతువు అయ్యుండి పింఛన్ పొందకపోతే లేదా పించన్ డేటా లో వివరాలు లేకపోతే వ్యక్తిగత దృవీకరణ.
7 . భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు - ఎ.పి.బి.ఓ.సి.డబ్ల్యూ. డబ్ల్యూ.బి. చే జారీ చేయబడిన కార్మికుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డ్.