Ads Area

Jagananna Cheddodu Scheme - జగనన్న చేదోడు పథకం

gvwv news

Jagananna Cheddodu Scheme - జగనన్న చేదోడు పథకం

పథకం ముఖ్య  ఉద్దేశం :- 

సొంత షాపు కలిగిన రజకులకు, నాయి బ్రాహ్మణులకు దురియు టైలర్లకు వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి సంవత్సరానికి పదివేల రూపాయల  ఆర్థికసాయాన్నందించడం.

అర్హతలు :- 

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/- మరియు పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000/- కంటే తక్కువ ఉండాలి.

మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండూ కలిపి 10 ఎకరాలకు మించరాదు.

కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.

పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణ స్థలం 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.

ఆధార్ కార్డు కలిగి ఉండవలెను,

ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర కుల ధ్రువీకరణ పత్రాన్ని (SC, ST, BC, Minority, EBC) కలిగి ఉండవలెను.

ఏ కులానికి చెందిన వారైనప్పటికీ పూర్తిగా టైలరింగ్'నే ప్రధాన వృత్తిగా స్వీకరించి జీవనోపాధి చేయుచూ.. సొంత షాపు కలిగిన టైలర్లు ఈ పథకానికి అర్హులు.

కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, ఆదాయపు పమ్మ చెల్లింపుదారులైతే ఈ పథకానికి అనరులు.

కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా సొంత వాహనంగా ఫోర్ వీలర్ (నాలుగు చక్రాల వాహనం) ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులు. ఆటో టాక్సీ మరియు ట్రాక్టర్లకు మినహాయింపు కలదు.


అనర్హతలు :-

మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేదా మెట్ట మరియు మాగాణి భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించి ఉన్న వారు అనర్హులు.

పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణ స్థలం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు.

కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే ఈ పథకానికి అనర్సులు.

కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా సొంత వాహనంగా ఫోర్ వీలర్ (నాలుగు చక్రాల వాహనం) ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులు. ఆటో టాక్సీ మరియు ట్రాక్టర్లకు మినహాయింపు కలదు.


కావలసిన పత్రాలు :-

ఆధార్ కార్డు,

బ్యాంక్ ఖాతా పుస్తకం.

ఆదాయ ధ్రువీకరణ పత్రం

కుల ధ్రువీకరణ పత్రం

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం :-

గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల ద్వారా పర్వే నిర్వహించి అరులను గుర్తిస్తారు.పారదర్శక విధానంలో గ్రామ వార్డు పచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తారు. గ్రామ సభల ద్వారా అర్హులందరికీ మేలు జరిగేలా లదారులను ఎంపిక చేస్తారు.

నిరంతర సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాంతాను గ్రామ వార్డు సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రదర్శిస్తారు.

అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరులేని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేసే విధానం సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

ఎవరికైనా అర్హతలున్నప్పటికీ పొరపాటున జాబితాలో పేరు లేకపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూపి, తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆ దరఖాస్తులను పరిశీలించి నెలలో ఆమోదముద్ర వేసి ఆర్థిక సాయాన్ని అందిస్తారు. 

అర్హులైన దరఖాస్తుదారునికి "  YSR (Your Service Request - మీ సేవల భ్యర్ధన)  " నెంబర్ ఇవ్వబడుతుంది.

Below Post Ad

Ads Area

Don't Try to copy, just share