మీ ఫోన్ పదే పదే హ్యాంగ్ అవుతోందా..? అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి,
స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే వారిలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఫోన్ హ్యాంగింగ్ ఒకటి. ఫోన్ ఉపయోగించే సమయం పెరుగుతున్నా కొద్దీ ఫోన్ వేగం నెమ్మదిస్తుంటుది. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో...
➤ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారికి ఎదురయ్యే సమస్యల్లో ఫోన్ హ్యాంగ్ ప్రధానమైంది. మొదట్లో చాలా వేగంగా పనిచేసిన స్మార్ట్ ఫోన్ తర్వాత స్లోగా మారుతుంది. పదే పదే ఫోన్ స్ట్రక్ అవుతుంటుంది. ఈ సమస్యను మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటారు.
➤ అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో నెమ్మదించిన ఫోన్ వేగాన్ని మళ్లీ తిరిగి వేగాన్ని పెంచొచ్చు. ఇందులో మొదటిది ఈ ఫోన్‌లో పెద్దగా ఉపయోగం లేని యాప్‌లను తొలగించాలి. ఫోన్ మెమోరీ నిండిపోయినా మొబైల్ వేగం నెమ్మదిస్తుందని తెలుసుకోండి.
➤ కేవలం యాప్స్ మాత్రమే కాకుండా ఫోన్‌లో ఉండే ఎక్కువ మెమోరీ ఉన్న ఫైల్స్, అనవసరమైన ఫొటోలను డిలీట్ చేస్తుండాలి.
➤ పెరిగిపోయే కాచ్ డేటా కూడా స్మార్ట్‌ఫోన్ వేగాన్ని తగ్గిస్తుంటుంది కాబట్టి స్టోరేజ్ ఆప్షన్‌లో ఉండే 'క్యాచ్‌డ్ దేటా'ను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుండాలి.
➤ మొబైల్ ఫోన్‌లో క్లీన్ మాస్టర్ వంటి యాప్‌లను ఉపయోగించడం ద్వారా కూడా ఫోన్ వేగాన్ని పెంచొచ్చు. ఈ యాప్‌తో తరచూ ఫోన్‌లో ఉండే ఫైల్స్‌ను క్లియర్ చేస్తుండాలి.
➤ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ని తక్కువగా ఉపయోగించుకునే క్రమంలో కొన్ని క్లౌడ్ స్టోరేజ్‌లను ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌పై ఒత్తిడి తగ్గి వేగంగా పని చేస్తుంది.
Source :- TV 9 (Link :- https://tv9telugu.com/photo-gallery/technology-photos/is-your-phone-getting-hang-here-some-simple-tips-for-fast-your-phone-530769.html )