wb_sunny

Breaking News

Ayushman Bharat (PM-JAY) App version Download

Ayushman Bharat (PM-JAY) App version Download


Ayushman Bharat cards:- 

వాలంటీర్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్ మరియు పంపిణీ


ఆయుష్మాన్ యాప్   న్యూ యాప్ లింక్ ≈ ఈరోజు(14.12.23) 1.9 వెర్షన్ కు అప్డేట్ అయ్యింది

apps

Ayushman Bharat (PM-JAY) App

version - 1 . 9


Download


ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు సమయం లో వాలంటీర్ కు కొత్త లాగిన్ క్రియేట్ చేయు విధానం :

𝐒𝐓𝐄𝐏 1 : ముందుగా కింద👇👇 ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.


𝐒𝐓𝐄𝐏 2 : SIGN UP పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Number వద్ద వాలంటీర్ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి E-KYC Mode వద్ద Aadhaar OTP / Fingerprint లో Aadhaar OTP సెలెక్ట్ చేసాక ఆధార్ కు లింక్ అయ్యే మొబైల్ కు వచ్చే OTP ను ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చెయ్యాలి.

𝐒𝐓𝐄𝐏 3 : Personal Information పేజీ లో పేరు, జెండర్, వయసు, చిరునామా ఎంటర్ చేసాక Email ID మరియు మొబైల్ నెంబర్ లకు OTP వస్తాయి వాటిని ఎంటర్ చేసి SUBMIT చేయాలి.

𝐒𝐓𝐄𝐏 4: Role Details ఓపెన్ అవుతాయి. అందులో

● మాతృ సంస్థ-SHA AP

● ఎంటిటీ రకం - డివిజన్

● ఎంటిటీ పేరు - IT

● వినియోగదారు పాత్ర - ఆపరేటర్ - BIS

● అప్లికేషన్ - BIS ఎంటర్ చేయాలి.

𝐒𝐓𝐄𝐏 5 : తరువాత User Name - మీకు నచ్చినది Password మరియు Confirm Password వద్ద గొప్యంగా ఉండే పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత Submit చేసాక ACCOUNT CREATE ని మెసేజ్ వస్తుంది. OK పై క్లిక్ చేయాలి


New Update :-


ఆయుష్ మాన్ భారత్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ ఆర్ రిజిస్టర్ చేయుటకు ఏ. ఎన్. యం కి గాని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ వారికి ఎటువంటి లాగిన్స్ లేవు కేవలం వాలంటీర్స్ కి మాత్రమే ప్రొవిజన్ ఇవ్వబడింది వారు వాలంటీర్ గా జాయిన్ అయినపుడు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయినదో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే వారికి లాగిన్ అవుతుంది. గమనించగలరు

ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్ చేయు విధానం

☛ ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడానికి అక్టోబర్ 5వ తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను, ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. తదనంతరం వాలంటీర్లు లాగిన్ అయిన తర్వాత, సోమవారం నుంచి వారి పరిధిలోని కుటుంబాలను విజిట్ చేస్తూ లబ్ధిదారులను రిజిస్టర్ చేయవలసి ఉంది.

☛ లబ్ధిదారుల జాబితాను యూజర్ మాన్యువల్ లో పేర్కొన్న లింక్ నుంచి ముందుగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సదరు జాబితాను పొందవలెను.ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలన్న నిబంధన లేదు. సెక్ (SECC) డేటా ప్రకారం రూపొందిన లబ్ధిదారుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 ☛ ఒకవేళ ఒక వాలింటర్ కు వేరే క్లస్టర్ నందు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పుడు, మొదటిగా లాగిన్ అయిన దాని నుంచే వేరే క్లస్టర్ లబ్ధిదారులను సైతం రిజిస్టర్ చేయవచ్చును. ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి విడివిడిగా ఆయుష్మాన్ భారత్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ 5 లోపు పూర్తి చేయ వలసిందిగా కోరడమైనది.

☛ వాలంటరీ లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారులను సెర్చ్ చేసేటప్పుడు లబ్ధిదారుల జాబితాలో ఉన్న యు.హెచ్.ఐ.డి (యూనివర్సల్ హెల్త్ ఐడి) ని గుర్తించి, దానిని యాప్ లో ఫ్యామిలీ ఐ.డి గా నమోదు చేసి సెర్చ్ చేస్తే, కుటుంబ సభ్యుల వివరాలన్నీ కనబడతాయి.

☛ ఒకవేళ వాలంటీర్ కుటుంబాన్ని సందర్శించి నప్పుడు కుటుంబ సభ్యులందరూ లేకపోతే, ఎంత మంది ఉంటే అంత మంది లబ్ధిదారులను రిజిస్టర్ చేసి, తదనంతరం మిగతా సభ్యులను కవర్ చేసే అవకాశం ఉంది. అందరు పంచాయతీ కార్యదర్శులు ఈ అంశం కనబరిచి ఇచ్చిన టైం లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోమని కోరడమైనది.

Mobile App Download And log in Process

☛ మీ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ తప్పనిసరిగా 9 లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్ ఉపయోగం లో ఉండాలి మొదటగా మీరు మీ మొబైల్ ఫోన్లో 'ఆయుష్మాన్ భారత్ మొబైల్ అప్లికేషన్' మరియు 'ఆధార్ ఫేస్ ఐడి' అనే మొబైల్ అప్లికేషన్ లు Install చేసుకోవాలి.

Ayushman Bharat (PM-JAY) App
App Version : 3.0.64

☛ తరువాత ఆయుష్మాన్ భారత్ అప్లికేషన్ లో "NHA Data Privacy Policy" విధానానికి 'ACCEPT' పై క్లిక్ చేయాలి. వెంటనే వచ్చిన అప్లికేషన్ HOME PAGE లో LOGIN ను CLICK చేసి SELECT LANGUAGE వద్ద భాషను సెలెక్ట్ చేసుకోవాలి. లాగిన్ యాప్ వద్ద OPERATOR అని సెలెక్ట్ చేసుకొని మీ రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి. వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేసి NEXT పై క్లిక్ చేయాలి.

☛ ఒకవేళ మీ మొబైల్ నెంబర్ తో OPERATOR గా రిజిస్టర్ అవ్వడానికి అంగీకరించని పక్షంలో మీ డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ వార్డు సెక్రటరీ లాగిన్ ద్వారా ముందు మీ మొబైల్ నెంబర్ను మార్చుకోవాలి. ఆ మార్చిన నెంబర్ ను PMJAY లో మార్పు చేశాక మాత్రమే మీ ఆపరేటర్ గా రిజిస్టర్ కాగలరు. ఇప్పుడు మీరు మర్చిపోకుండా ఉండే ఒక నాలుగు అంకెల PIN ఎంటర్ చేయాలి. గమనిక ఈ నాలుగు అంకెల PIN నెంబర్ ఉపయోగించి మాత్రమే మీరు ఎప్పుడూ ఈ యాప్  వాడగలుగుతారు కావున మీరు ఈ పిన్ను గుర్తు ఉండేలా ఒక నాలుగు అంకెల నెంబర్ను ఉంచవలసిందిగా మనవి. ఇక్కడితో ఆపరేటర్ గా మీరు నమోదు అయినట్టే..

ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డును రెండు రకాలుగా నమోదు చెయ్యవచ్చు


1. ఆధార్ UHID ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID)

2. వారి జిల్లా, మండలం, సచివాలయం, క్లస్టర్ (Search By Village / Town)


1. ఆధార్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి (Search by ID):

క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా మీ క్లస్టర్ ఐడి తో ఉన్న ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల వివరాలు పొందవచ్చు. 👇

https://egsws.ap.gov.in/AyushmanbharatData.aspx ]

తద్వారా వారి ఆధార్ ను ఉపయోగించి మీరు (Search By ID) నుండి నమోదు చేయవచ్చు నమోదు చేయవలసిన లబ్ధిదారుని ఆధార్ ఎంటర్ చేయగానే వారి కుటుంబ సభ్యుల వివరాలు వస్తాయి.

అందులో మీరు నమోదు చేసే వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి వివరాల వద్ద ఉన్న AUTHENTICATE అనే బటన్ ను క్లిక్ చేసి నమోదు చేసే లబ్ధిదారుని ఆధార్ కు అతని ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో కనుక్కొని Authorization Type లో MOBILE OTP లేదా FACE AUTHENTICATION ను ఎంచుకోవాలి.

FACE AUTHENTICATION ::- 

FACE AUTHENTICATION ఎంచుకుంటే క్రింద తెలిపిన ఐదు విషయాలు పాటించవలసి ఉంటుంది:

1.మీరు లబ్ధిదారుని మీ ఫోను ఎదురుగా ఉండవలసి ఉంటుంది ఫోన్ లో సెల్ఫీ కెమెరా ఆన్ చేయరాదు.

2.ఫోనుకు మరియు లబ్ధిదారునికి మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి అంతకుముంచి తక్కువ ఉన్న లేదా ఎక్కువ ఉన్నా కెమెరా ఆ వ్యక్తిని గుర్తించకపోవచ్చు.

3.లబ్ధిదారుని మీద సరిపడా వెలుతురు పడేలా చూసుకోవాలి. 4.ఈ పేస్ ద్వారా చేసే పద్ధతిలో లబ్ధిదారుడు కనీసం రెండు లేదా మూడుసార్లు కనురెప్పలు ఆడించవలసి ఉంటుంది.

5. మొబైల్ ఫోన్ను మరియు లబ్ధిదారునికి వీలైనంతవరకు కదలకుండా ఉండేలా చూడాలి.

6. మొబైల్ ఫోను మరియు లబ్ధిదారులు ఎదురెదురుగా ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ✅️ Tick వచ్చి Image Successfully Captured అని వస్తే లబ్ధిదారుని ఫేస్ ద్వారా గుర్తించే ప్రక్రియ అయినట్టుగా. ఒకవేళ కింద చూపిన ఎర్ర రంగులో ❌️ సంబల్ వచ్చినచో మళ్ళీ Face Authentication గుర్తించే ప్రక్రియ పైన తెలిపిన విధంగా మళ్లీ చేయవలసి ఉంటుంది.

Mobile OTP :: -

MOBILE OTP ఎంచుకుంటే లబ్ధిదారునికి వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి నమోదు చేయాలి. ఇప్పుడు పైన తెలిపిన విధంగా మొబైల్ నెంబర్ ను నమోదు చేసి వచ్చిన OTP మళ్ళీ ఎంటర్ చేసి ఫోటో తీసి SUBMIT క్లిక్ చేసి నమోదు ముగించాలి.ఇక్కడితో EKYC ద్వారా గుర్తించే విధానం ముగిసినట్టు.


ఇప్పుడు లబ్ధిదారుని మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి దానికి వచ్చిన OTP ఎంటర్ చేసి TAKE PHOTO అని క్లిక్ చేయాలి లబ్ధిదారుని ఫోటోని తీయవలసి ఉంటుంది ఒకవేళ ఫోటో సరిగ్గా రాకపోతే సరిగా వచ్చేలా మరోసారి ఫోటో తీయాలి ఆ తరువాత రాష్ట్రం జిల్లా మండలం గ్రామం ఎంచుకోవాలి.తరువాత Terms & Conditions అనే చెక్ బాక్స్ ను Tick చేసి Submit బటన్ ను క్లిక్ చేయాలి. .


గమనిక : లబ్ధిదారుని క్రింద చూపిన విధంగా చాతి పైన వరకు PASSPORT SIZE ఫోటో మాత్రమే తీయాలి.

ఒకవేళ మీరు పొంద పరిచిన వివరాలు ఆధార్ తో సరిపడే ఉంటే AUTO APPROVAL పద్ధతి ద్వారా కార్డు వెంటనే జనరేట్ అవుతుంది. ఏ లబ్ధిదారుల వివరాలైతే ఆధార్ వివరాలతో సరిపోలేదు ఈ కేవైసీ అయిన ఆ లబ్ధిదారుల వివరాలు ట్రస్ట్ ఆరోగ్యశ్రీ వారి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది ట్రస్ట్ వారు ఆమోదించిన తర్వాత మాత్రమే వారికి కార్డు జనరేట్ అవుతుంది.


సచివాలయానికి చెందిన ANM, వాలంటీర్ల ద్వారా ఆ సచివాలయ పరిధిలో గుర్తించబడిన అన్ని కుటుంబాల నమోదు అయ్యే విధానం పర్యవేక్షిస్తారు. AUTO APPROVAL అయిన లబ్ధిదారులకు ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డు ప్రింటింగ్ కి పంపబడతాయి. ప్రింట్ అయిన ఆయుష్మాన్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ PVC హెల్త్ కార్డులను సచివాలయంలోని ANM లకు అందించడం జరుగుతుంది. వాటిని పైన తెలిపిన విధంగా సదరు వాలంటీర్ కు పంపిణీ చేయించే బాధ్యత ANM పై ఉంటుంది."

2. రాష్ట్రం జిల్లా మండలం సచివాలయం క్లస్టర్ (Search By Village / Town ) :

ఈ పద్ధతి ద్వారా ముందుగా

State (రాష్ట్రము) : ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకొని

District (జిల్లా) : మీ జిల్లా

Block (మండలం) : మీ మండలం

Village ( సచివాలయం) : మీ సచివాలయం

Cluster (క్లస్టర్) : మీ వాలంటరీ క్లస్టర్ను

ఎంచుకొని 'View List' నొక్కిన వెంటనే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల వివరాలు వస్తాయి. అందులో మీరు పేరు ద్వారా లబ్ధిదారుని వెతికే సౌలభ్యం ఉండటం వల్ల మీరు నమోదు చేయబోయే లబ్ధిదారుని ఆ లిస్టు నుండి వెంటనే ఎంచుకోవచ్చు అందులో మీరు నమోదు చేసే లబ్ధిదారును ఎంచుకొని పైన తెలిపిన Mobile OTP లేదా Face Authentication ప్రక్రియ ద్వారా ఈ కేవైసీ చేసే నమోదు చేయవలసి ఉంటుంది.

పంపిణీ చేయు విధానం ::- 

'Card Delivery' నీ సెలెక్ట్ చేసుకుని లబ్ధిదారుని ఆధార్ ద్వారా కుటుంబ సభ్యుల లిస్టు వస్తాయి వచ్చిన కుటుంబ సభ్యుల వివరాలలో AUTHENTICATED అని ఉన్న లబ్ధిదారుల కార్డులు మాత్రమే పంపిణీ చేయటానికి వీలవుతుంది. కార్డులు నేరుగా లబ్ధిదారుని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇవ్వవచ్చు అందుకుగాను SELF, FAMILY అని రెండు OPTION లు ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో లబ్ధిదారుడైతే SELF అని లేదా కుటుంబ సభ్యులైతే FAMILY అని ఎంచుకొని సబ్మిట్ క్లిక్ చేసి కార్డు తీసుకోదలిచిన వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా కార్డు డెలివరీ చేయవలసి ఉంటుంది. "


Download User Manual ::- 

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.