YSR Kalyanamastu / YSR Shadi Tofa Scheme Deatils Telugu - GVWV News
YSR Kalyanamastu / YSR Shadi Tofa Scheme Application Status And Payment Status :-
YSR Kalyanamastu / YSR Shadi Tofa డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు
మీ అకౌంట్లో డబ్బులు పడిందా ? లేదా ? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మీ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.
Step - 1 :: ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని YSR Kalyanamastu / YSR Shadi Tofa చెక్ చేసుకో గలరు. 👇 👇
Step - 2 :: Type దగ్గర UID ఎంచుకొనండి
Step - 3 :: Scheme దగ్గర YSR Kalyanamastu / YSR Shadi Tofa ఎంచుకొండి.
Step - 4 :: UID దగ్గర మీ యొక్క ఆధార్ ఎంటర్ చేయండి.
Step - 5 :: ఆ పై Get Details click చేయండి.
ఏటువంటి లాగిన్ అవసరం లేదు.
YSR Kalyanamasthu (YSR Pelli Kanuka) Details
వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక పథకంతో ముందుకొచ్చింది. వైఎస్‌ఆర్ కళ్యా ణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేయనున్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. దివ్యాంగులైతే రూ.1.5 లక్షలు అందిస్తారు. మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయల నగదు సాయం అందించనున్నారు.
YSR కళ్యాణమస్తు | YSR షాదీ తోఫా - అర్హతలు, విధి విధానాలు
● వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
● వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత.
● వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)
● వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
● మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండవచ్చు.
● కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల మినహాయింపు ఉంది.
● నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
● నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
● ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
● మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
● ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.
YSR కళ్యాణమస్తు కింద అందించే మొత్తం
ఎస్సీలకు - లక్ష రూపాయలు
ఎస్సీల కులాంతర వివాహాలు - రూ.1.2 లక్షలు
ఎస్టీలకు - లక్ష రూపాయలు
ఎస్టీల కులాంతర వివాహాలు - రూ.1.2 లక్షలు
బీసీలకు - రూ.50 వేలు
బీసీల కులాంతర వివాహాలు - రూ.75 వేలు
భవన నిర్మాణ కార్మికులకు - రూ.40 వేలు
దివ్యాంగుల వివాహాలకు - రూ. 1.5 లక్షలు
YSR షాదీ తోఫా (YSR Shaadi Tohfa) :-
మైనారిటీలకు షాదీ తోఫా కింద - లక్ష రూపాయలు
YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ప్రశ్నల - సమాదానాలు
Answer : అర్హులు అవ్వరు.